హాజీపూర్ లో ముగ్గురు బాలికలపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సైకోకిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో తవ్విన కొద్దీ ఎన్నో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ యువతితో సన్నిహితంగా మెలిగిన ఫొటోలను షేర్ చేశారు. ఆ యువతితో ప్రేమలో ఉన్నానని.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యానని పోలీసుల ఎదుట విచారణలో తెలిపారు.
శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతిది ప్రముఖ పుణ్యక్షేత్రమున్న వేములవాడ.. ఆ యువతి జాడ కోసం వెతికిన పోలీసులకు లభించలేదు. అదే సమయంలో ఏప్రిల్ 21న వేములవాడ సమీపంలోని అగ్రహారం గుట్టల్లో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. అయితే శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన అమ్మాయే అగ్రహారం గుట్టల్లో మృతిచెందిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వేములవాడలో సదురు యువతి గురించి పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎంత వెతికినా దొరకకపోవడంతో చనిపోయిన యువతే శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే శ్రీనివాస్ రెడ్డి ఘోరాలపై లోతుగా దర్యాప్తు జరపాలని జిల్లా కలెక్టర్ అనితారాంచంద్రన్, జేసీ రమేష్, డీసీపీ నారాయణ రెడ్డిలతో కూడిన అధికార బృందం నిర్ణయించింది. గ్రామ శివారులో పాడుబడిన బావులను పూడ్చి వేయాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే అంతకుముందు మరోసారి బావులను పూర్తిగా తవ్వి శ్రీనివాస్ రెడ్డి ఘోరాలపై ఆధారాలు సేకరించి అతడికి కఠిన శిక్ష అమలయ్యాకే బావులను పూడ్చివేయాలని కలెక్టర్ నిర్ణయానికి వచ్చారు.
శ్రీనివాస్ రెడ్డి హతమార్చిన బాలికలపై బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత గ్రామస్థుల కోరిక మేరకు హాజీపూర్ లోని బావులను పూడ్చివేస్తామని పోలీసులు తెలిపారు. శాస్త్రీయంగా అన్ని ఆధారాలు లభించి కఠిన శిక్షలు నిందితుడికి పడేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.