సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇలాంటివి జరుగుతుంటే మన సమాజం ఎటుపోతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కన్నుమిన్ను కానకుండా చెలరేగిపోయిన ఓ కామాంధుడు ఏకంగా కన్నతల్లిపై అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గమైన ఘటన కర్ణాటకలో తీవ్రకలకలం రేపింది.
కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత గొంతు నులిమి చంపేసిన కసాయి కొడుకు వ్యవహారం వెలుగుచూసింది.
ఇప్పటికే మృతురాలి భర్త చనిపోగా.. కొడుకుతో కలిసి ఉంటోంది. ఓ వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలిసింది. ఆమెను ఎంతగా వారించినా వినకపోవడంతో ఈ అఘాయిత్యం చేసినట్టు సమాచారం.
ఈ విషయం తెలిసిన శివప్ప తల్లిపై కోపంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.