క్వారంటైన్‌ లో ఉన్న అనుమానితుడు మృతి

Update: 2020-04-06 17:59 GMT
కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ఈ సమయంలో కరోనా లక్షణాలు ఉన్నవారితోపాటు.. దేశ, విదేశాల వచ్చిన వారిని వారికి లక్షణాలు లేకున్నా కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఈ క్రమంలో వారి ఆరోగ్య పరిస్థితులు నిరంతరం పరిశీలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందడం తో క‌లకలం రేపుతోంది. హోమ్ క్వారంటైన్‌ ఉన్న ఓ వ్యక్తి మ‌ర‌ణించడం తో అతడికి కరోనా సోకిందా అనే ప్రచారం సాగుతోంది. స్థానికులు తీవ్ర ఆందోళన చెందతున్నారు. అయితే ఆ మృతుడి అంత్యక్రియ‌ల‌ను అధికారులే ద‌గ్గరుండి చేయడంతో మరింత భయాందోళన చెలరేగుతోంది. క‌రోనా మృతుల‌కు చేసిన మాదిరి చర్యలు తీసుకోవడం తో ఆ జిల్లాలో కలవరం మొదలైంది.

నిజామాబాద్ జిల్లా మోపాల్‌ మండలంలోని కంజర్‌ గ్రామానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి గల్ఫ్‌కు వెళ్లి వచ్చాడు. మార్చి 23వ తేదీన స్వగ్రామం కంజర్‌ రావడం తో అధికారులు అతడిని గుర్తించి ఇంట్లోనే ఉండాలని.. బయటకు రావొద్దని సూచించారు. ఈ సందర్భంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. ఈ క్వారంటైన్‌లో ఉన్నప్పటి నుంచి వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు రోజూ అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సమయంలోనే ఏప్రిల్ 4వ తేదీన ఆ వ్యక్తి ఛాతీనొప్పి వస్తుందని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో కొన్ని మాత్రలను అందజేశారు. అయితే అదే రోజు అర్ధరాత్రి తర్వాత అతడికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. అతడికి

దుబాయ్ నుంచి వచ్చిన నాటి నుంచి అతడు క్వారంటైన్‌లో ఉండటం.. ఆ సమయంలోనే మృతి చెందడంతో కరోనా వైరస్‌ సోకి మరణించాడనే ప్రచారం సాగింది. అయితే అతడి మృతదేహాన్ని కవర్లతో చుట్టి, రసాయనాలు చల్లి అధికార యంత్రాంగం అంత్యక్రియలు జరిగేలా చేశారు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతడు గుండెపోటుతో మృతి చెందాడని స్థానిక అధికారులు చెబుతున్నా గ్రామస్తులు మాత్రం కరోనా వైరస్‌తోనే మృతిచెందాడనే భావనలో ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. కరోనా లక్షణాలు లేకున్నా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అతడి అంత్యక్రియలు నిర్వహించినట్లు వివరిస్తున్నారు. గ్రామస్తులెవరూ ఆందోళన చెందొద్దు.. కరోనా వైరస్‌ సోకలేదని చెబుతున్నారు.
Tags:    

Similar News