క‌రోనా వారియ‌ర్స్ కోసం తమిళనాడు ప్ర‌భుత్వం కీలక నిర్ణయం..!

Update: 2020-04-22 15:00 GMT
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య . అనేక దేశాల్లో ఈ వైరస్ పంజా విసురుతోంది. ఈ వైరస్ ధాటికి కొన్ని దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మరికొన్నిచోట్ల మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 179,032 మంది చనిపోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25.78 లక్షలకు చేరుకుంది. ఈ వైరస్‌ నుంచి 7,04,873 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 45 వేల మందికి పైగా మృతి చెందారు.

మరోవైపు భారత్‌ లో కూడా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయింది. మృతుల సంఖ్య 640గా ఉంది. ఇకపోతే ఈ నేపథ్యం లోనే క‌రోనా క‌ట్ట‌డిలో ముందు వ‌ర‌స‌లో ఉండి ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌ర్తిస్తోన్న వారియర్స్ కోసం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కరోనా మహమ్మారి నివారణకు శ్రమిస్తున్న వైద్యలు మృతి చెందితే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చెయ్యాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాదు వైద్య - ఆరోగ్యశాఖ - పోలీస్ - మున్సిపల్ సిబ్బందిలో ఎవరైనా కరోనా కారణంగా మృతి చెందితే వారికి 50 లక్షలు నష్ట పరిహారం ఇవ్వ‌డంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని తమిళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఇప్పటివరకు తమిళనాడు లో 1596 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ..మృతుల సంఖ్య 18 కి చేరింది. అలాగే ప్రస్తుతం 943 మంది కరోనా కి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 635 మంది కరోనా పై విజయం సాధించి డీఛార్జ్ అయ్యారు.
Tags:    

Similar News