భయంకరమైన నిజం బయటకొచ్చింది.. వీర్యంలోనూ తిష్ట

Update: 2020-05-25 04:00 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగానికి సంబంధించిన షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. దీనిపై పరిశోధనలు జరుపుతున్న వారు తాజాగా వెల్లడించిన వివరాలు వింటే.. గుండెలు అదిరిపోవటమే కాదు.. మహమ్మారి మరీ ఇంత డేంజరస్సా అన్న భావన కలుగక మానదు. ఇంతకాలం మాయదారి రోగానికి సంబంధించిన ఆనవాళ్లు శరీరంలోని కొన్నిచోట్ల ఉండవన్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా జరిపిన పరిశోధనల్లో కొత్త అంశాలు బయటకు వచ్చాయి.

పురుషుల వీర్యంలోనూ మహమ్మారికి సంబంధించిన ఆనవాళ్లు తిష్ట వేస్తున్నట్లు గుర్తించారు. సాధారణంతో  శరీరంలోని  వృషణాలు.. కళ్లు.. పిండం.. కేంద్ర నాడీ వ్యవస్థ భాగాల్ని ఇమ్యునోప్రివిలైజ్డ్ సైట్స్ గా అభివర్ణిస్తారు. శరీరానికి రక్షణ వ్యవస్థపై జరిగే దాడిని తట్టుకొని ఈ ప్రాంతాల్లో వైరస్ బతకదని భావించేవారు. దీనికి భిన్నంగా వీర్యంలోనూ ఆనవాళ్లు కనిపించిన వైనాన్ని గుర్తించారు.

మరో కొత్త అంశాన్ని కూడా గుర్తించారు. ఒకసారి మాయదారి రోగానికి గురైన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉండిపోవటమే కాదు.. లైంగిక సంబంధాల కారణంగా భాగస్వామికి అంటుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకూ వెలుగు చూసిన చాలా వైరస్ లలో ఇలాంటి టిపికల్ లక్షణాలు చూడలేదంటున్నారు. ఈ పరిశోధన నిజమైతే.. ఇప్పటివరకూ గుండె దిటువుగా ఉన్న వారందరికి కొత్త టెన్షన్ మొదలైనట్లే.
Tags:    

Similar News