ట్విట్టర్ కొత్త సీఈవోగా తెరపైకి వచ్చిన కొత్త పేరు.. చివర్లో ట్విస్ట్..!
అపర కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను కొన్ని నెలల కిందట హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ సీఈవో సహా ఇతర బోర్డు సభ్యులు.. ఉద్యోగులను ప్రక్షాళన చేపట్టి ఎలన్ మస్క్ తన మార్క్ ను చూపించారు.
ఈ క్రమంలోనే ట్విటర్ లో బ్లూ టిక్ వెరిఫై విధానానికి 8 డాలర్ల చొప్పున ఛార్జ్ చేయడం సంచలనంగా మారింది. దీంతోపాటుగా ట్విట్టర్ ఖాతాదారుల కోరిక మేరకు వైన్ యాప్ ను తిరిగి తీసుకు రాబోతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. కాగా ఇటీవల ట్విట్టర్లో జరుగుతున్న అనేక పరిణామాల నేపథ్యంలో సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
దీంతో ఎలన్ మాస్క్ సీఈవో పదవీ మున్నాళ్ల ముచ్చటేనా అన్న చర్చ సైతం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళ తనను ట్విట్టర్ సీఈవోగా ఎలన్ మస్క్ తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ ఊహించని మలుపుకు దారితీసింది. ఇంతకీ ఆ మహిళ ఎవరంటే పాపులర్ టీవీ షో ‘జిమ్మీ కుమ్మెల్’ స్క్రిప్ట్ రైటర్ బెస్ కాల్బ్.
గతంలో ఎమ్మీ అవార్డుకు సైతం బెస్ కాల్బ్ నామినేట్ అయ్యారు. హ్యూమర్ తో కూడిన రైటింగ్ కు బెస్ కాల్బ్ పెట్టింది పేరు. దీంతో ఆమె సరదాగా.. వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేసి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఆమె ఎలన్ మస్క్ ను విమర్శించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కొత్త సీఈవో బాధ్యతలపై తొలుత సరదాగా స్పందించిన ఎలన్ మస్క్ ఆ తర్వాత సీరియస్ గా స్పందించారు. తాము కేవలం సీఈవో గురించి మాత్రమే వెతకడం లేదని.. ట్విట్టర్ ను బాధ్యతతో నిలబెట్టే వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ కొత్త సీఈవో కోసం ఆ సంస్థ అనధికారికంగా వెతుకుతుందని ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.