ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ కలకలం రేపారు.. సినీ నటుడు శివాజీ. టీడీపీ అభిమానిగా ఆ పార్టీని గెలిపించడానికి ఆయన కష్టపడ్డా ఫలితం దక్కలేదు. ఎన్నికల్లో ఓడిపోయాక శివాజీ సైలెంట్ అయిపోయారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఉత్తర కంచిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ సీఎం జగన్ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు కాబట్టి.. తాను గెలుస్తానని కలలు కంటున్నారని.. అయితే ఆయన కలలు కల్లలేనని శివాజీ తేల్చిచెబుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల ముందు 20 వేల చొప్పున డబ్బులు ఇచ్చారని.. అయినా ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. అసలు సీఎం జగన్ తన సొంత ఊరు పులివెందులలోనే గెలవడమే కష్టమని శివాజీ అభిప్రాయపడ్డారు. కష్టపడితే 1000, 2000 ఓట్ల తేడాతో జగన్ బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు తాను 40 నియోజకవర్గాల్లో సర్వే చేయించానని బాంబుపేల్చారు. దీపావళి, సంక్రాంతి మధ్య ఆ సర్వే ఫలితాలు బయటపెడతానన్నారు.
ఏపీలో జగన్ పాలన దారుణంగా ఉందని సామాన్యులు బతికే పరిస్థితి లేదని శివాజీ అభిప్రాయపడ్డారు. మద్యం అమ్ముకోవడం, ఇసుక అక్రమాలు, కబ్జాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అమ్ముకోవద్దని.. రాజకీయ నేతలు ఇచ్చే డబ్బులకు ఆశపడొద్దని కోరారు. 600కి మంచి రబ్బరు చెప్పులు కూడా రావడం లేదని.. 2000కి ఓటు అమ్ముకుంటే ఏం వస్తుందన్నారు. నోటు, బిర్యానీ, క్వార్టర్ బాటిల్ కు ఓట్లు అమ్ముకోవద్దని విన్నవించారు.
పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఓట్లు చీలనివ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మీకు ఎవరైతే మంచి చేస్తారో అనుకుంటారో.. ఎవరు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నారో వాళ్లను మాత్రమే ఎన్నుకోవాలని సూచించారు.
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం గురించి మాట్లాడుతూ.. తప్పు చేసి సామాజికవర్గాన్ని అడ్డుగా పెట్టుకోవడం సరికాదన్నారు. ఆ వీడియో ఎవరిదో ఎంపీతోపాటు సీఎం జగన్‌కు కూడా తెలుసని చెప్పారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకుంటే మరి అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావులపైన ఇలాంటివి ఉన్నాయని.. వాటిపైన ప్రశ్నించే అవకాశం ఉందని.. అందుకే గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవడం లేదన్నారు.
గోరంట్ల మాధవ్ ఆ న్యూడ్ వీడియో తనది కాదంటున్నారని.. అయితే ఆ వీడియో నాదేనని శివాజీ ఎద్దేవా చేశారు. ఆ వీడియో ఎవరిదో.. నిజమో, కాదో సీఎం జగన్‌కు కూడా తెలుసని స్పష్టం చేశారు. గోరంట్లకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరన్నారు.