అప్పుడు తెలంగాణ భవన్.. ఇప్పుడు లోటస్ పాండ్

Update: 2021-02-21 04:08 GMT
రాజకీయ అనుభవం ఉన్న వారికి.. లేనోళ్లకు మధ్య వ్యత్యాసం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా లోటస్ పాండ్ దగ్గర కోలాహలం చూసే వారికి ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న రాజన్న కుమార్తె షర్మిల.. అందుకు తగ్గట్లే తన కార్యాచరణను పక్కాగా ఉండేలా సెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఏదో టైంపాస్ కోసమో.. మరెవరూ చెబితే.. తలూపి ఆట ఆడేందుకు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టాలన్న యోచనలో లేరన్న విషయం స్పష్టమవుతోంది.

ఏపీ సీఎం జగనన్నకు ఇష్టం లేకున్నా.. అన్నీ తానై చూసుకుంటూ పార్టీ వ్యవహారాల్ని జోరుగా సాగిస్తున్న షర్మిల తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. గడిచిన కొద్దిరోజులుగా లోటస్ పాండ్ దగ్గర సందడిని చూస్తున్న వారంతా పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ భవన్ వద్ద కూడా ఈ తరహా సందడే కనిపించేదని చెబుతున్నారు. కొత్త పార్టీ పెట్టిన రోజున.. ముఖ్యమైన రోజుల్లో కాసింత హడావుడి కామన్.

అందుకు భిన్నంగా.. రోజులు గడిచే కొద్దీ.. ఒక క్రమపద్దతిలో ఆదరణను పెంచుకోవటంతో పాటు.. పార్టీ కార్యాలయానికి వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తీరు చూస్తే.. రాజన్న కుమార్తెను ఆశీర్వదించేందుకు వైఎస్ అభిమానులుసిద్ధంగా ఉన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ భవన్ వద్ద సందడి ఉంటే.. తాజాగా రాజన్న రాజ్యసాధన కోసం పవర్లోకి రావాలని భావిస్తున్న షర్మిల నివాసమైన లోటస్ పాండ్ దగ్గర కనిపిస్తున్న సందడి.. వైఎస్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించేలా ఉందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News