ఏపీలో వింత రాజకీయ పరిస్థితి ఉంది అని అంటున్నారు. మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ మీద ప్రజా వ్యతిరేకత చాలానే పెరిగిపోతోంది. ఆ పార్టీ విధానాలు కూడా చాలా మంది జనాలకు నచ్చడంలేదు. ఏపీలో అభివృద్ధి లేదు అంటున్న వారి సంఖ్య రాను రానూ బాగా పెరిగిపోతోంది. వైసీపీ అంటే బటన్ ఒక్కే ప్రభుత్వంగా ముద్ర తెచ్చుకుంది.
మరి అలాంటి ప్రభుత్వం మీద జనాలు గుస్సా మీద ఉన్నారని ఒక వైపు ప్రచారం అయితే సాగుతోంది. మరి ఏపీలో వైసీపీకి ధీటైన పార్టీగా ప్రతిపక్ష టీడీపీ ఉంది. మరి వైసీపీ తగ్గితే ఆ వ్యతిరేకత బాగా ఉంటే అటు నుంచి ఇటుగా మళ్ళి టీడీపీకి మొత్తానికి మొత్తం రావాలి కదా. కానీ ఏపీలో చూస్తే ఆ రకమైన పొలిటికల్ సినేరియో ఏదీ కనిపించడంలేదు.
వైసీపీ గ్రాఫ్ ఎంత తగ్గినా టీడీపీ గ్రాఫ్ మాత్రం ఏ మాత్రం ఎక్కడా ఏ కోశానా పెరగడంలేదు. మరి ఈ వ్యతిరేకత ఎటు పోతోంది. జనాలకు ఆల్టర్నేషన్ గా ఏ పార్టీ ఉంది. అసలు ఏపీలో వైసీపీకి ధీటైన ఆల్టర్నేస్ధన్ ఉందా లేదా, ఏపీలో ఈ రకమైన పరిస్థితి రాజకీయ విశ్లేషకుల బుర్రలకు కూడా అందడంలేదు అంటున్నారు.
ఏపీలో చూస్తే వైసీపీ ఏలుబడిలో అసలు డెవలప్మెంట్ లేదు. కనీసం వీధి దీపం స్థంభానికి బల్బ్ కూడా వేయించే స్తోమత సర్పంచులకు లేకుండా పోతోంది. ఖజానా నుంచి వచ్చే డబ్బులు కానీ అప్పుల ద్వారా పుట్టే సొమ్ములు కానీ అన్నీ కూడా కలగలిపి పధకాలకే పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. సంక్షేమం ఒక్కటి చాలు డెవలప్మెంట్ అవసరం లేదు అన్నట్లుగా ఏపీలో వైసీపీ రాజకీయం సాగుతోంది.
మరో వైపు చూస్తే వైసీపీ క్యాడర్ ని కూడా హై కమాండ్ అసలు పట్టించుకోవడంలేదు. మూడున్నరేళ్ళలో బాగా దూరం పెరిగింది. నాయకుల తీరు వేరుగా ఉంది, కార్యకర్తకు వారికీ దూరం ఎక్కువ అయిపోయింది. దాంతో సోషల్ మీడియాలో కూడా వైసీపీ క్యాడర్ పెద్దగా ఉత్సాహంగా కనిపించడంలేదు.
ఇకపోతే సోషల్ మీడియా అన్నది ఒక బురద గుంట అని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని కూడా అంటున్నారు. అందుకే ఆ వైపుగా క్యాడర్ ని పెద్దగా ఫోకస్ పెట్టేలా చర్యలు తీసుకోవడంలేదు అని అంటున్నారు. ఇక టీడీపీ తీరు చూస్తే వైసీపీ వంద తప్పులు చేస్తే తమకు నచ్చినవి, తమ దృష్టికి వచ్చినవి మచ్చుకు కొన్ని అన్నట్లుగా తీసుకుని వాటినే హైలెట్ చేస్తోంది తప్ప పెద్దగా వైసీపీ మీద పోరాటం చేయడంలేదు అని అంటున్నారు
అదే విధంగా టీడీపీకి పెద్దగా బలోపేతం కాలేదు అని కూడా అంటున్నారు. ఇక టీడీపీకి అతి పెద్ద బలంగా ఉన్న అనుకూల మీడియా పచ్చ గొట్టాలు మాత్రం వైసీపీ మీద వీర లెవెల్లో దుమ్మెత్తి పోస్తున్నాయి. వాటి పని అదే అన్నట్లుగా కూడా గట్టి సంకల్పం తీసుకుని మరీ ఆ పనిలో ఫుల్ బిజీగా ఉంటున్నాయి.
అలా అనుకూల మీడియా చేసే రాద్ధాంతం మాత్రం సూపర్ సక్సెస్ అవుతోంది అంటున్నారు. దానికి కారణం వైసీపీ నుంచి ఏ మాత్రం కౌంటర్లే ఉండడంలేదు కదా. అయితే ఇది సరిపోతుందా. టీడీపీకి అనుకూల మీడియా సపోర్ట్ చేస్తే చాలా. గ్రౌండ్ లెవెల్ లో సీన్ మారుతుందా అంటే అది 2019 ఎన్నికల వేళ చూసిన సినిమావే.
జనాలు టీవీ చానళ్ళను ప్రింట్ మీడియాను కూడా పార్టీలుగా విభజించి చూసే కల్చర్ ఏపీలో స్టార్ట్ అయి చాలా కాలమే అయింది. దాంతో అలా జస్ట్ టైమ్ పాస్ గా చూస్తారు తప్ప వాటిని తమ బుర్రల్లోకి ఎక్కినేసుకుని వాటి మీదనే ఆధారపడి ఒపీనియం చేంజి చేసుకోవడంలేదు. మరి టీడీపీ ఎలా పటిష్టం అవుతుంది అంటే జనాల్లో పోరాటం చేయాలి.
కానీ ఎంతసేపూ చంద్రబాబు ఆరాటమే కానీ నాయకులు వీధుల్లోకి వచ్చి పోరాడిన సీన్ అయితే లేదు కదా. అందుకే టీడీపీ గ్రాఫ్ పెరగడంలేదు అని అంటున్నారు. ఇక దీనినే చూసుకుంటూ వైసీపీ కూడా అతి ధీమా పడుతోంది అని అంటున్నారు. కానీ విపక్షం ఎపుడూ జనంలోనే ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినపుడు అది కచ్చితంగా అధికార పార్టీకి దెబ్బ అవుతుంది. దాన్ని ఒడుపుగా పట్టుకున్న విపక్షానికే అందలం దక్కుతుంది.
మరి ప్రజలలో ఈ రోజుకు పధకలౌ వెళ్తున్నాయి కాబట్టి చల్లగా ఉన్నారని వైసీపీ భావించవచ్చు. వారే తమ ఓటు బ్యాంక్ అని కూడా అంచనా వేసుకోవచ్చు. కానీ 2024 ఎన్నికల నాటికి ఏమి జరుగుతుంది అన్నది ఎవరూ ఊహించలేరు. అన్నీ ఇస్తున్నా కూడా ఓట్లు రివర్స్ వేసే సీన్ రావచ్చు. అలాగే పధకాలు దండుగ అనే టీడీపీ ఇంతకు మించి రెట్టింపు పధకాలతో జనంలోకి రావచ్చు. అందువల్ల నిమ్మళంగా ఉండేందుకు వైసీపీకి చాన్సే లేదు అంటున్నారు. మొత్తానికి ఏపీలో ఈ రోజుకు మాత్రం ఏమీ తెలియని ఒక రాజకీయ అనిశ్చితి అయితే ఉంది. అది ఎటు వైపు తిరిగి ఎవరికి దెబ్బేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానికి టైమ్ కూడా ఇంకా చాలానే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.