తాలిబన్ల నుంచి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు కట్టుబట్టలతో అఫ్గాన్‌ను వదిలి పెడుతున్న ఆ దేశ పౌరులకు ప్రపంచ దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. అయితే.. అన్ని దేశాలూ కావు. కొన్ని మాత్రమే అఫ్గన్లను అక్కున చేర్చుకుంటు న్నాయి. ప్రస్తుతం "తాలిబన్ల నుంచి విముక్తి పొందాలి.. ఎలాగైనా దేశాన్ని విడిచివెళ్లిపోవాలి.." లక్షలాది మంది అఫ్గాన్ ప్రజల ఆలోచన ఇదే. ఇందుకోసం కట్టుబట్టలతో విమానాశ్రయాలకు పరుగులు తీస్తుంటే.. మరికొందరు మూటలు నెత్తిమీద వేసుకుని.. దేశ సరిహద్దులను కాలినడకన దాటేస్తున్నారు. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించినప్పటి నుంచి ఆ దృశ్యాలు అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తున్నాయి.
అయితే, అఫ్గన్ ప్రజలు దేశాన్ని దాటడం ఒకెత్తు.. వెళ్లిన ప్రాంతంలో జీవించడం మరో ఎత్తు! ఎందుకంటే వారికి శరణార్థులు గా గుర్తిస్తారు. అయితే అఫ్గాన్ ప్రజలను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. తగిన విధంగా సహాయం చేస్తామని హామీనిచ్చాయి. మరికొన్ని దేశాలు మాత్రం వారికి దూరంగా ఉంటున్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు 1,200మంది అఫ్గాన్‌వాసులను అమెరికా అక్కడి నుంచి తరలించింది. రానున్న రోజుల్లో ఆ సంఖ్య 3,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో కొంతమందికి వసతులు కల్పించేందుకు కూడా అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం యూఎస్ రెఫ్యూజీ అడ్మిషన్స్ ప్రొగ్రాం(యూఎస్ఆర్ఏపీ)ను వినియోగించుకోనుంది. మొత్తం మీద 10 వేల మంది అఫ్గాన్ ప్రజలను రక్షించేందుకు అగ్రరాజ్యం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా అభ్యర్థన మేరకు మరిన్ని దేశాలు ముందుకు వచ్చాయి. వీటిలో కెనడా.. 20,000 మంది అఫ్గాన్వాసులకు ఆశ్రయమివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రిటన్.. 5వేల మంది అఫ్గాన్లను స్వాగతిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నూతన పునరావాస కార్యక్రమంలో భాగంగా పిల్లలు, ఆడవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది.
భారత్.. శరణార్థుల విషయంలోమన దేశం ఎలాంటి విధానాలను అనుసరించడం లేదు. ఇన్నేళ్లు.. వేర్వేరు దేశాల్లోని సంక్షోభ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని, చర్యలు చేపట్టింది. కానీ ప్రత్యేక వ్యవస్థ లేదు. అయితే అఫ్గాన్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం ఈ-వీసాలను ప్రవేశపెట్టింది. దేశంలోకి వారు అడుగుపెట్టే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమిస్తే.. తమ సరిహద్దులను మూసివేస్తామని ఈ ఏడాది జూన్‌లోనే ప్రకటించారు.
కానీ తాజాగా అలాంటి నిర్ణయాలేవీ ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకోలేదు. ఫలితంగా సరిహద్దుల్లో భారీ జన ప్రవాహం కనపడుతోంది. కాలి నడకన ప్రజలు సరిహద్దులను దాటుతున్నారు. ఈ నేపథ్యంలో వలస వస్తున్న వారి కోసం తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా సమగ్ర వ్యూహాల రచిస్తున్నట్టు పాక్ వెల్లడించింది. ఇరాన్.. అఫ్గాన్ వలసదారులకు ఆశ్రయమిచ్చేందుకు మూడు రాష్ట్రాల్లో తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. అయితే.. అఫ్గాన్‌ను వీడి తమ దేశంలోని వచ్చే ప్రజలను.. అక్కడ పరిస్థితులు చక్కబడిన వెంటనే పంపేస్తామని తేల్చిచెప్పింది.
ఉజ్బెకిస్థాన్.. అఫ్గాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నా.. తమకు ఏదీ పట్టనట్టుగా ప్రవర్తిస్తోంది పొరుగు దేశం ఉజ్బెకిస్థాన్. కరోనా అని కారణంగా చెబుతూ.. మూసివేసిన సరిహద్దును ఇంకా తెరవలేదు. అఫ్గాన్ ప్రజలు వీసాలు దాఖలు చేసినా.. అవి తిరస్కరణకే గురవుతున్నాయి. టర్కీ.. ఇక్కడ కూడా పరిస్థితులు భిన్నంగా లేవు. వలసదారులను అడ్డుకునేందుకు టర్కీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే.. సరిహద్దు ప్రాంతమైన వాన్లో.. అఫ్గాన్ ప్రజలను నిర్బంధించింది. ఇదిలావుంటే, అమెరికా అభ్యర్థన మేరకు.. తమ దేశంలోకి అఫ్గాన్ ప్రజలను తగిన సంఖ్యలో అనుమతిచ్చేందుకు ఉత్తర మెకడొనియా, ఉగాండా, అల్బెనియా-కొసొవా దేశాలు అంగీకరించాయి.