సాధారణంగా మనకి తెలిసిన , మనం చూసిన కార్లకు ఇంధనంగా డీజిల్, పెట్రోల్, సీఎన్ జీ గ్యాస్ లను వినియోగిస్తారు. ఈ మధ్య కాలంలో కాలుష్యం తగ్గించడానికి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు కార్ల వాడకం పెరుగుతోంది. అయితే బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ మరో అడుగు ముందుకేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఆస్టోన్ మార్టిన్ కారును వైన్ తో నడిపిస్తున్నారు.
మద్యం తాగి కారును నడపడం నేరం.. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే, వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నూటికి నూరుశాతం నిజం. స్వయానా ఓ దేశ యువరాజు తన కారు మద్యంతో నడుస్తోందని ప్రకటించారు. రాజసౌధంలో మిగిలిపోయిన వైన్ ను పోసి ఆస్టోన్ మార్టిన్ కారులో యువరాజు చక్కర్లు కొడుతున్నారు. తన 21వ ఏట (51 ఏళ్ల క్రితం) బహుమతిగా అందుకున్న ఆస్టోన్ మార్టిన్ కారంటే ప్రిన్స్ చార్లెస్‌కు ఎంతో ఇష్టం. యువరాజు అభిరుచులకు తగ్గట్లుగా ఇంజినీర్లు తీవ్రంగా శ్రమించి.. ఈ కారును వైన్ తో నడిచేలా రీడిజైన్ చేశారు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్ తో నడుస్తోంది.
బకింగ్ హామ్ ప్యాలెస్ లో మిగిలిపోయిన వైన్‌ను ఈ కారుకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు జున్ను తయారీ చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఇంధనంగా వాడుతున్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ ఈ విషయాలను వెల్లడించారు. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రపంచ నేతలు చేస్తున్న కృషికి తన వంతు సహకారం అందించేందుకు పెట్రోల్, డీజిల్ బదులు వైన్ ను ఉపయోగిస్తున్నానని ప్రిన్స్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ నెల 31న సమావేశం జరగనుంది. దీనిపై యువరాజు మాట్లాడుతూ భూగోళాన్ని రక్షించేందుకు ఐరాస జీవవైవిద్య శిఖరాగ్ర సమావేశంలో దేశాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.