బతికుంటే ‘బలుసాకు’.. కేసీఆర్ చెప్పిన ఆకు కథ ఇదీ

Update: 2020-04-09 23:30 GMT
కరోనా టైం.. అందరూ లాక్ డౌన్ తో ఇళ్లలోనే ఉంటున్నారు. సర్వం బంద్ కావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోయి అందరూ రోడ్డున పడుతున్నారు. అయితే ఉపాధి కంటే ప్రాణాలే ముఖ్యమని మన ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నాయి.

తాజాగా సీఎం కేసీఆర్ కూడా ‘బతికుంటే బలుసు ఆకు’ తిని బతకవచ్చని.. లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగించాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరోనాకు మందు లేదని.. కాబట్టి బతకాలంటే అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే కేసీఆర్ చెప్పిన ‘బలుసు ఆకు’ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బతుకుంటే బలుసు ఆకు అని కేసీఆర్ అన్నాడని.. ఆ ఆకు ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఎక్కడ దొరుకుతుంది? అని అందరూ ఆరా తీస్తున్నారు.

*బలుసుకు ఆకు అంటే ఏంటి?

బలుసు ఆకు శాస్త్రీయ నామం ‘వెబెరా టెట్రాండ్ర - కాంథియం పార్వి ఫ్లోరమ్’ అని అంటారు. దీన్ని సంస్కృతం లో వృక్ష గ్రంథి అని పిలుస్తారు. ఇది ఎంతో ఔషధ గుణాలు కలిగిన చెట్టు. బలుసు ఆకు చెట్టు వేరు నుంచి, మాను చెక్క నుంచి ఆకుల నుంచి తీసిన కషాయంతో ఎన్నో ప్రయోజనాలున్నాయట.. అతిసార - నీళ్ల విరేచనాలు వెంటనే తగ్గిస్తుంది. బలుసు ఆకుతో కూర చేసుకుంటారు. పైత్యం - జ్వరాన్ని తగ్గిస్తుంది. 

*బలుసు ఆకు తింటే లాభాలు

బలుసు ఆకు వగరుగా ఉన్నప్పటికీ మధురంగా ఉంటుంది. ఈ చెట్టు ఆకుల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. దేవతలకు ప్రియమైన ఆకుగా చెబుతారు. ఈ ఆకులతో పచ్చడి చేసుకుంటారు. ఈ కూర తింటే గౌట్ వ్యాధి తగ్గుతుంది. ఆకు రసాన్ని 10మి.లీలు చొప్పున చక్కెరతో కలిపి తాగితే మూత్రం మంట తగ్గుతుంది. బలుసు వేరు రసం తాగితే పొట్ట క్లీన్ అవుతుంది. అజీర్తిని తగ్గించి ఆకలి పెంచుతుంది. బలుసు పండ్లతో మలబద్దకం దూరమవుతుంది. దీని ఆకులను చట్నీగా - కూరగా - ఉట్టిగా కూడా తిని కూడా బతుకుతారు. అందుకే కేసీఆర్ బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అని చెప్పారు.



Tags:    

Similar News