కేసీఆర్ ర్యాలీని ఆపడానికి కాంగ్రెస్ స్కెచ్ ఇదీ..

Update: 2021-04-14 07:30 GMT
నాగార్జున్‌సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేశారు. కేవలం ఒక బహిరంగ సభతో తెలంగాణ రాష్ట్ర సమితి వైపు ఓటర్లను తిప్పగల సామర్థ్యం కేసిఆర్‌కు ఉందని అందరికీ తెలిసిందే. ఆయన మాటల మంత్రంతో ఓటర్లు టీఆర్ఎస్ కే ఓట్లు గుద్దేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే కాంగ్రెస్ నేతల్లో భయానికి కారణమవుతోంది.

 కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు కె జనారెడ్డి  ఎలాగైనా సరే తక్కువ తేడాతోనైనా సీటు గెలుచుకోవాలని భావిస్తున్నారు. కాబట్టి నాగార్జునసాగర్ కు కేసీఆర్ వస్తే ప్రమాదమని కాంగ్రెస్ భావిస్తోంది. దీన్ని ఆపడానికి చివరి ప్రయత్నాలు చేస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత ఎన్నికల కమిషన్ కు  లేఖ రాశారు. ఉప ఎన్నికలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సభను రద్దు చేయాలని విన్నవించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని.. టిఆర్ఎస్ డబ్బు పంపిణీ చేస్తోందని ఫిర్యాదు చేశారు.

భారత ఎన్నికల కమిషన్  కోవిడ్ -19 మార్గదర్శకాలను అమలు చేయకపోతే, కోవిడ్ -19 వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం బహిరంగ సభకు స్థానిక మరియు ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు వస్తే కరోనా మరింత వ్యాపిస్తుందని ఉత్తమ్ చెప్పారు. . ఇప్పటికే స్థానికేతరులు చాలా మంది నియోజకవర్గంలో క్యాంపింగ్ చేస్తున్నారని, నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి స్థానికులు కానీ వారందరినీ వెంటనే నియోజకవర్గం నుంచి బయటకు వెళ్ళమని ఈసీ కోరాలని ఉత్తమ్ లేఖలో కోరారు.

టిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి ఉపయోగిస్తున్న వేలాది వాహనాలను ఈసీ అధికారులు స్వాధీనం చేసుకోవాలని.. అవి అనుమతులు లేనివని.. టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రిజిస్టర్లో చేర్చడం లేదని లేఖలో ఫిర్యాదు చేశారు.

కోవిడ్ -19 మహమ్మారిపై ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనపై అత్యవసర చర్యలు తీసుకోవాలని.. చెక్‌పోస్టుల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని.. నగదు మరియు మద్యం కోసం వాహనాలను తనిఖీ చేయాలని ఉత్తమ్ కోరారు.  "ఏప్రిల్ 14 న జరగాల్సిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో కోవిడ్ -19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలి" అని ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణలో కోవిడ్ -19 వైరస్ విస్తరిస్తూ భారీ కేసులు నమోదవుతున్నాయని.. ఈసీ ప్రజల జీవితాలను  ప్రమాదంలో పడేయకుండా వెంటనే కేసీఆర్ సభకు అనుమతి రద్దు చేయాలని సూచించింది.
Tags:    

Similar News