ఇదేం దారుణం: చేతినొప్పితే ఆస్పత్రికి వెళితే చేయి కోల్పోయింది.?

Update: 2022-09-02 23:30 GMT
వైద్యుల నిర్లక్ష్యం ఓ యువతికి ప్రాణసంకటమైంది. చెవి నొప్పికని వెళితే ఆమె చేయి కోల్పోయిన దారుణం అందరినీ షాక్ కు గురిచేసింది. చెవినొప్పితే వెళ్లిన ఆ యువతికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. వాళ్లు చేసిన వైద్యం వికటించడం వల్ల 20 ఏళ్ల రేఖ తన ఎడమ చేయిని కోల్పోయింది.

రేఖ చెవినొప్పి బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అనంతరం ఇంజక్షన్ ఇచ్చి పంపించారు. చేయి నొప్పి పెడుతోందని చెప్పినా పట్టించుకోలేదు. వైద్యులు నిర్లక్ష్యంగా చేసిన వైద్యం వికటించి ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. చివరకు ఆమె ఎడమ చేయిని మోచేతి వరకూ తొలగించి ప్రాణాలు కాపాడారు వైద్యులు. ఈ దారుణ ఘటన బీహార్ లోని పాట్నాలో జరిగింది.

శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పాట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. జులై 11న శస్త్రచికిత్స నిర్వహించి మందులు రాశారు. అనంతరం వైద్యులు సూచించిన ఇంజక్షన్ ను యువతికి ఇచ్చింది నర్స్.. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన రేఖకు ఎడమ చేయి రంగుమారడమే కాకుండా నొప్పి తీవ్రమైంది. ఆస్పత్రికెళ్లి వైద్యులను సంప్రదించగా వారు స్పందించలేదు. కొద్దిరోజులకు నయం అవుతుందని చెప్పి పంపించేవారు.

ఆ తర్వాత కూడా నొప్పి తగ్గకపోవడంతో అనేక ఆస్పత్రుల చుట్టు తిరిగింది రేఖ. పట్నాలోని ఆస్పత్రులతోపాటు ఢిల్లీలోని ఎయిమ్స్ కు వెళ్లినా నొప్పి తగ్గలేదు. చివరగా పట్నాలోని వేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. ఆగస్టు 4న శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె ఎడమ చేయిని మోచేతి వరకూ తొలగించారు. అనంతరం 15 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షించారు.

రేఖకు ఈ నవంబర్ లోనే పెళ్లి కుదిర్చారు. ఇప్పుడు ఆమె చేయిని తొలగించడం వల్ల వరుడి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేశారు. దీంతో ఆ కుటుంబం రోధిస్తోంది. దీనికి కారణమైన మహావీర్ సంస్థాన్ ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

దీనికి కారణమైన మహావీర్ ఆస్పత్రి స్పందించింది. రేఖ అవయవ మార్పిడి ఆపరేషన్ ను ఢిల్లీలో నిర్వహిస్తామని మహావీర్ ఆస్పత్రి తెలిపింది. రేఖ చేయి కోల్పోవడానికి కారణమైన వైద్యుడు, నర్స్ ను సస్పెండ్ చేశామని వివరణ ఇచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News