ప్రతి ఆటలోనూ మేటి ఒకరుంటారు. కానీ కష్టాలను ఓర్చి అన్ని గ్రాండ్ స్లామ్ లలోనూ నెగ్గేవాడు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖుడు నోవాక్ జకోవిచ్. ఈ సెర్బియా ఆటగాడు టెన్నిస్ లో ఎదురేలేకుండా ముందుకు సాగుతున్నాడు.
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పట్టుదలతో విజయాలను అందుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే కఠిన ప్రత్యర్థుల కారణంగా వరుస ఓటములు ఎదురైనా సెర్బియా యోధుడు వెనకడుగు వేయలేదు. ఓటమి ఎదురైనా ప్రతిసారి మరింత కసితో దూసుకొచ్చాడు. ట్రోఫీలు దక్కకపోయినా పోరాటం వదల్లేదు. ఆటను నమ్ముకొని ముందుకు సాగాడు. దిగ్గజాలకే ఎదురు నిలిచాడు.
చివరకు గ్రాండ్ స్లామ్ విజయాలకు జకో కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లలో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ల సరసన అతడు చేరాడు. ఈ ఏడాది అద్భుత ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్ గా నిలిచాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జకోవిచ్ 6-7, 6-4,6-4,63తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలుపొందడం ద్వారా తన కేరీర్ లో 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించాడు. దీంతో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యదిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా రోజర్ ఫెదరర్ (20), రాఫెల్ నాదల్ (20) పేరిట ఉన్న రికార్డును జకోవిచ్ సమం చేశాడు.
ఇక సెప్టెంబర్ లో జరిగే యూఎస్ ఓపెన్ లోనూ గెలిస్తే రాడ్ లేవర్ (1969) తర్వాత క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు. 2005లో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలో జకోవిచ్ బరిలోకి దిగాడు. 2008లో తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గాడు. మూడేళ్లు ఓడిపోయి మరింత బలంగా 2011 నుంచి టెన్నిస్ వీరులు ఫెదరర్, నాదల్ లను ఓడిస్తూ పైచేయి సాధించాడు. 2018 నుంచి జకోవిచ్ జోరుకు అసలు బ్రేకులు లేకుండా పోయాయి. గత 14 గ్రాండ్ స్లామ్ లలో 8 జకోవిచ్ గెలుచుకోవడం విశేషం. దీంతో చివరకు దిగ్గజాల సరసన చేరాడు.