మరీ ఇంత అడ్డంగా బుక్కయ్యారేంటి..!

Update: 2020-10-13 00:30 GMT
ఓ యువతి తన భర్తకు తెలియకుండా ఎఫైర్​ నడుపుతోంది. ఎప్పటిలాగే భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోగానే ప్రియుడు వచ్చేశాడు. బెడ్​రూమ్​లో ఇద్దరూ మంచిగా ఎంజాయ్​ చేస్తున్నారు.. ఈ క్రమంలో సడన్​గా భర్త వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక.. ప్రియుడిని ఎలా దాచాలో పాలుపోక వాళ్లిద్దరూ ఫుల్​ టెన్షన్​ పడుతున్నారు.

ఇంతలో యువతికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. భర్త వచ్చేలోపు ప్రియుడిని బాల్కానీ గుండా కిందకు పంపించాలనుకున్నది. ఇద్దరూ కలిసి స్పీడ్​గా బాల్కనీ వైపు పరుగులు తీశారు. అయితే ట్విస్ట్​ ఏమిటంటే .. ఆ సమయంలో ప్రియుడు బట్టలు వేసుకోలేదు. మరి అంత సోయి లేకుండా ఉన్నాడు గురుడు. అయినా సరే ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడుదామనుకున్నాడు.

ఇంతలోనే కింది వాటాలో ఉన్న ఓ అంకుల్​ ఇతగాడి వాలకం గమనించి చిపురుతో ఒక్కటిచ్చాడు. అప్పటికే భర్త కూడా అక్కడికి వచ్చాడు. ఇలా ప్రియుడితో కలిసి అడ్డంగా బుక్కైపోయింది ఆ యువతి. ఇంత తతంగం జరుగుతా ఉంటే చుట్టుపక్కల వాళ్లు ఊరికే ఉండరుగా. చేతిలోని స్మార్ట్ ఫోన్లు బయటకు తీసి ఈ దృశ్యాలను వీడియో తీసారు. అందరికీ షేర్ చేసుకోడంతో పాటు పనిలో పనిగా యూట్యూబ్​లో పెట్టేశారు. జనాలకు కూడా ఇలాంటి వీడియోలు చూడటం ఆసక్తే. అందుకే ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్​ అవుతున్నది. వివాహేతర సంబంధాలు, తలుపు చాటు వ్యవహారాలు ఎప్పటికైనా డేంజరో చెప్పకనే చెబుతున్నది ఈ ఘటన.



Full View
Tags:    

Similar News