ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఎలాంటి రాజకీయ నేత జీవితాన్నైనా తలకిందులు చేసేస్తుంది. మళ్ళీ పోలిటికల్ స్క్రీన్ మీద కనపడకుండా చేస్తుంది. సేమ్ ఇలాగే ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల టీడీపీలో ఉన్న సీనియర్ దంపతుల రాజకీయ జీవితమే క్లోజ్ అయిపోయేలా కనిపిస్తోంది. ఇంతకీ దంపతులు ఎవరో కాదు 2014 ముందు వరకు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరు డిసిసి అధ్యక్షుడుగా పని చేసిన ఆమె భర్త పనబాక కృష్ణయ్యలు.
పనబాక లక్ష్మి 2009 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి. అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. అందకు ముందు ఆమె నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 2004తో పాటు అంతకు ముందు కూడా అక్కడ ఆమె ఎంపీగా విజయం సాధించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన వరకు వీరికి కాంగ్రెస్ లో మంచి స్థానం ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2014 ఎన్నికల్లో కూడా ఆమె కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. బాపట్లలో ఎంపీగా ఆమెకు కేవలం 23 వేల ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక తర్వాత నుంచి ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక లక్ష్మి భర్త కృష్ణయ్య సైతం 2009లోనూ, 2014లోనూ గూడురులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల ముందుకొచ్చేసరికి ఆమె టీడీపీ, వైసీపీలో ఎందులో చేరాలని కన్ఫ్యూజ్ అవుతూ చివరికి భర్తతో కలిసి టీడీపీలో చేరారు. అప్పటికే వైసీపీ గెలుస్తుందనే ప్రచారం ఉంది. ఆమెకు వైసీపీ నుంచి బాపట్ల లేదా తిరుపతి ఎంపీ సీట్లలో ఏదో ఒకటి ఇస్తామంటూ ఆఫర్లు కూడా వచ్చాయి.
అలాగే ఆమెకు వైసీపీలో ఉన్న నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా సరే అటు వెళ్లకుండా టీడీపీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి పనబాక దంపతులు అసలు అడ్రెస్ లేరు. పార్టీలో యాక్టివ్ గా లేరు. అసలు వాళ్లు టీడీపీలో ఉన్నామని చెప్పుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఈ పరిణామాలని గమనిస్తుంటే రాజకీయాల్లో పనబాక దంపతుల చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే కనిపిస్తోంది