క‌నీవినీ ఎరుగం- 31 వేల కోట్లు జ‌ప్తు

Update: 2018-03-20 15:12 GMT
ఆయ‌న కొన్నివేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత‌.....ఎన్నో కంపెనీలు....మ‌రెన్నో వ్యాపారాలు....2007 ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ లో టాప్ -100 లో చోటు ద‌క్కించుకున్న వ్యాపార దిగ్గజం.....సీన్ క‌ట్ చేస్తే....ఈ రోజు ఆయ‌న ఆస్తులు వేలం వేసి అప్పులు చెల్లించాల్సిన దుస్థితి....సినిమా సీన్ల‌ను త‌ల‌పిస్తోన్న ఈ వాస్త‌వ ఘ‌ట‌న‌లు సౌదీ అరేబియాలోని ఓ బిజినెస్ టైకూన్ నిజ‌ జీవితంలో జ‌రుగుతున్నాయి. సౌదీ అరేబియాకు చెందిన సాద్ గ్రూప్ అధినేత మాన్ అల్ సేనియా త‌న జీవితంలో ఇటువంటి రోజొక‌టి వ‌స్తుంద‌ని అస‌లు ఊహించి ఉండ‌రు. సౌదీలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన సాద్ గ్రూప్ ల‌కు అధిప‌తి అయిన మాన్...2009లో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ల‌ను - ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన జీతాల‌ను ఎగ్గొట్టాడు. దీంతో, అత‌డిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు 2016లో త్రిస‌భ్య క‌మిటీని సౌదీ స‌ర్కార్ నియ‌మించింది. ఆ విచార‌ణ పూర్త‌వ‌డంతో తాజాగా సౌదీ స‌ర్కార్ మాన్ ఆస్తుల‌ను జ‌ప్తు చేసేందుకు సిద్ధ‌మైంది.

సౌదీ యువ‌రాజు మ‌హ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్....అధ్యక్షుడిగా ప‌ద‌వి చేప‌ట్టాక‌....దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు కాకముందే అవినీతిపై ఉక్కుపాదం మోపిన స‌ల్మాన్....బ్యాంకుల‌కు - ఉద్యోగుల‌కు వేల కోట్లు ఎగ‌వేసిన మాన్ పై చర్య‌ల‌కు ఆదేశించారు. దేశ విదేశాల్లోని వివిధ బ్యాంకులు - ఉద్యోగుల జీతాల నిమిత్తం చెల్లించ‌వ‌ల‌సిన వేల కోట్ల బ‌కాయిలను రాబ‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీంతో - మాన్ కు చెందిన దాదాపు రూ.31 వేల కోట్ల ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునేందుకు  అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అందులో భాగంగా - మాన్ కు చెందిన దాదాపు 900 వాహ‌నాలను వేలం వేశారు. సాద్ గ్రూపున‌కు చెందిన బ‌స్సులు - లారీలు - డిగ్గ‌ర్లను స్థానికులు వేలంపాట‌లో ద‌క్కించుకున్నారు. త్వ‌ర‌లోనే మాన్ కు చెందిన మ‌రిన్ని స్థిరాస్తుల‌ను కూడా విడ‌త‌లవారీగా వేలం వేసేందుకు ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఓడ‌లు బండ్లు....బండ్లు ఓడ‌లు కావ‌డం అంటే ఇదేనేమో....అని మాన్ ను ఉద్దేశించి ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇదే త‌ర‌హాలో - భార‌త్ లోని బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ‌వేసిన విజ‌య్ మాల్యాపై కూడా భార‌త స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకునే రోజు త్వ‌ర‌లోనే రావాల‌ని ఆశిద్దాం.

Tags:    

Similar News