కరోనాకు చికిత్స లేదు. మందులు లేవు. దానికి వ్యాక్సిన్ వేసుకుంటేనే రక్ష. కానీ వాక్సిన్లు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే అందుబాటులో ఉన్న ప్లాస్మాథెరపీని, రెమెడిసివిర్ ఇంజక్షన్లను వేస్తూ కరోనా రోగులను వైద్యులు రక్షిస్తున్నారు. అయితే వీటి వల్ల మరో ప్రమాదం ముంచి ఉందని తేలింది.
కరోనా సోకగానే విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స, రెమెడిసివిర్ వినియోగంతో కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు వచ్చి మరింత బలోపేతం అయ్యే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవైపు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దాడితో వైరస్ లో ఉత్పరివర్తనాలు వచ్చే ముప్పు ఉంటుంది. దానికి తోడు సమయం, సందర్భం లేకుండా రెమెడిసివిర్, ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వినియోగిస్తే వైరస్ మరింత శక్తిమంతమవుతుంది' డాక్టర్ రమణ్ గంగఖేడ్కర్ తెలిపారు. ఇలా జరుగకుండా ప్రభుత్వం వైద్యులకు, ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
భారత్ లో వేల సంఖ్యలో బాధితులు కరోనా బారిన పడుతున్నారని.. వారికి ప్లాస్మా థెరపీని, రెమెడిసివిర్ వినియోగాన్ని హేతుబద్దం చేయాలని రమణ్ సూచించారు. ఇలా విచ్చలవిడిగా చికిత్సలు చేస్తే వైరస్ లో వచ్చే మ్యూటేషన్లు వ్యాక్సిన్ల వల్ల వచ్చే రక్షణ వ్యవస్థను కూడా తప్పించుకునేవిగా ఉండే ప్రమాదం ఉందని డాక్టర్ రమణ్ హెచ్చరించారు. ఇది ప్రపంచానికి ప్రమాదమన్నారు.సెకండ్ వేవ్ చికిత్సలను పరిమితం చేయకపోతే భారత్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి వైరస్ ల ఉత్పత్తి కేంద్రంగా మారుతుంది' అని హెచ్చరించారు.