ఇండియాకు వెళ్లిపోవాలంటూ అమెరికా చట్టసభ్యురాలు ప్రమీలాకు బెదిరింపు కాల్స్.. కలకలం

Update: 2022-09-10 07:10 GMT
అమెరికాలో జాత్యంహకారం మరోసారి బయటపడింది. ఏకంగా అమెరికా చట్టసభ సభ్యురాలు.. భారతీయురాలైన ప్రమీలా జయపాల్ నే బెదిరించే స్థాయికి చేరింది. ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఫోన్ చేసి మరీ ఓ వ్యక్తి ఆమెను దూషించాడు. అంతేకాదు జాతివివక్ష, జాత్యాహంకారం ప్రదర్శిస్తూ ఆమెను ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఇందుకు సంబంధించిన ఐదు ఆడియో క్లిప్పులు వైరల్ అయ్యాయి.

తనను జాత్యాహంకారంతో బెదిరించిన ఐదు అడియో క్లిప్పులను అమెరికా చట్టసభ్యురాలైన ప్రమీలా తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరీ అభ్యంతరకరంగా.. పరుష పదజాలంతో  ప్రమీలాను దూషించాడు ఆ వ్యక్తి. అంతేకాదు  పుట్టిన దేవఆనికి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు కూడా.

తమిళనాడులోని చెన్నైలో పుట్టిన ప్రమీలా(55).. సియాటెల్ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రతినిధుల సభ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి ఇండో అమెరికన్ డెమొక్రటిక్ పార్టీ తరుపున కూడా ఈమెనే.. ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం మొదటిసారేందకాదు.. ఈ ఏడాది సమ్మర్ లోనే సియాటెల్ లోని ఆమె ఇంటి బయట గన్ తో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ప్రవీలా కుటుంబసభ్యులను తిడుతూ బెదిరించాడు. ఆ దుండగుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

ఇటీవలే  ఓ అమెరికన్ మహిళ రెస్టారెంట్ కు వచ్చిన భారతీయ మహిళలపై దాడి చేయడం కలకలం రేపింది. టెక్సాస్ లో ఈ దారుణం వెలుగుచూసింది. భారతీయ మహిళలు వీడియో తీయడంతో ఇది బయటి ప్రపంచానికి తెలిసివచ్చింది.

పోలీసులు దాడి చేసిన అమెరికన్ మహిళను అరెస్ట్ చేశారు.  టెక్సాస్ లో రాత్రి ఓ రెస్టారెంట్ వెలుపల జరిగింది ఈ సంఘటన. టెక్సాస్‌లోని ప్లానోకు చెందిన ఒక అమెరికన్ మహిళ.. భారతీయ మహిళపై దాడి చేయడమే కాకుండా  జాత్యంహకార బెదిరింపులకు పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమెరికన్   మహిళను అరెస్టు చేశారు.

ఇటీవల అమెరికాలో స్తిరపడిన భారతీయులపై జాత్యహంకారం ప్రదర్శిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఘటనలపై చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Tags:    

Similar News