ప్రాణభయంతో 'దిశ నిందితులు భిక్కుభిక్కు

Update: 2021-02-11 01:30 GMT
దిశ నిందితుల కుటుంబీకులు భయంతో భిక్కుభిక్కుమంటున్నారు. ఇప్పటికే తమ వారి ఎన్ కౌంటర్  పై వారంతా సుప్రీంకోర్టుకు ఎక్కుతూ పోలీసులపై పోరాడుతున్నారు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వారికి తాజాగా ప్రాణభీతి ఏర్పడింది.దిశా నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.  దీంతో ఎన్ కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులు తమకు ప్రాణహాని ఉందని దిశ విచారణ కమిషన్ ను ఆశ్రయించారు.

కేసు వెనక్కి తీసుకోవాలని  వాళ్లను బెదిరిస్తున్నట్టు వారి తరుఫు న్యాయవాది రజనీ ఆరోపించారు. మృతుల కుటుంబాలు కోర్టుల మెట్లు ఎక్కవద్దని బెదిరిస్తున్న ఆమె సంచలన ఆరోపణలు చేశారు.రూ.25 లక్షలు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని దిశా మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. చెన్నకేశవులు తండ్రి మృతి గురించి లారీ ఓనర్ శ్రీనివాసరెడ్డిపై అనుమానం ఉందన్నారు.
Tags:    

Similar News