ట్రాన్స్‌జెండ‌ర్ ‌కు బెదిరింపులు నామినేష‌న్ విత్‌ డ్రా!

Update: 2021-04-03 09:51 GMT
కేరళ రాష్ట్రంలో లో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కేరళలోని మలప్పురానికి చెందిన అనన్య కుమారి అలెక్స్.. వెంగర నియోజకవర్గం నుంచి డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చి నామినేషన్ కూడా వేశారు. అనన్య నామపత్రాలను రిటర్నింగ్ అధికారి సమీక్షించి ఆమోదించారు. దీంతో కేరళ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ ఎన్నికల అభ్యర్థిగా నిలిచినట్లైంది.  ఎన్నికల్లో గెలుపోటములతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు అనన్య. తమ వర్గానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది.

అయితే , మలప్పురంలోని వెంగర నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండ‌ర్ అన‌న్య కుమారి అలెక్స్‌ అనూహ్యంగా తన నామినేషన్ విత్ డ్రా చేసుకుంది.  కేరళలో తొలి ట్రాన్స్ జెండర్ రేడియో జాకీగా గుర్తింపు పొందారు అనన్య. ఈ ఎన్నికలు చరిత్రను తిరగరాస్తాయని భావిస్తున్న తరుణంలో ఆమె ఊహించని రీతిలో ఎన్నికల బరి నుండి తప్పుకోవడంతో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఆ పార్టీ నాయ‌కుల నుంచే ఆ ట్రాన్స్‌జెండ‌ర్‌కు బెదిరింపులు వ‌చ్చాయని , మాన‌సిక వేధింపులు అధిక‌మ‌య్యాయ‌ని, నామినేష‌న్ విత్‌ డ్రా చేసుకోక‌పోతే చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని అని అన‌న్య తెలిపారు. ఆ వేధింపులు భ‌రించ‌లేక‌నే ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకున్న‌ట్లు ఆమె స్ప‌ష్టం చేశారు. వెంగ‌ర నియోజ‌క‌వ‌ర్గంలో ఎల్ డీఎఫ్ అభ్యర్థిగా పి.జీజీ, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) అభ్యర్థి కునాలీకుట్టి పోటీ పడుతున్నారు.
Tags:    

Similar News