జయలలిత మృతి తరువాత ఆ వెంటనే ఆమె అనుంగు అనుచరుడు పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాజకీయాంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సజావుగా సాగిపోతున్నట్లు కనిపిస్తోంది. కానీ, అసలు పరిస్థితి వేరు.. లోలోన ముఠాలు మొదలవుతున్నాయి. అమ్మ బతికున్నప్పుడు పార్టీలో నంబర్ 1.. 2.. 3.. ఇలా 10 వరకు అంతా ఆమెనే. కానీ... ఇప్పుడు అమ్మ లేరు. అంతేకాదు... మరణానికి ముందు 75 రోజులుగా రాజకీయంగా ఇన్ యాక్టివ్ గా ఉన్నారు. దీంతో జయ పరోక్షంలో అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలోనే జయ మృతి తరువాత పన్నీర్ సెల్వం ఎన్నిక కూడా అంత తేలిక కాలేదు. అందరి మద్దతు తొలుత దొరకలేదు.. కానీ... కేంద్రం జోక్యం కూడా ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో మొత్తానికి ఏదో ఒక రకంగా ఇలాంటి విషాద వేళ తొలుత పన్నీర్ ను పీఠంపై కూర్చోబెట్టారు.
మొదట మామూలు జ్వరం - అతిసారంతో అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ లాంటి అనేక సమస్యలతో దాదాపు మూడు నెలలుగా ఆస్పత్రిలోనే ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు నెలలు కూడా జయలలిత లేకుండానే రాష్ట్రంలో పరిపాలన సాగిందనేది వాస్తవం. ఆస్పత్రిలో ఉన్న జయలలితకు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నామని, పొరుగు రాష్టమ్రైన కర్నాటకతో కావేరి జలాల వివాదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంతో పాటుగా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోను ఆస్పత్రి బెడ్ పైనుంచే ఆమె ఆదేశాలు ఇస్తూ వస్తున్నారని అన్నాడిఎంకె వర్గాలు ఎప్పటికప్పుడూ చెప్తూ ఉన్నప్పటికీ జయలలిత అనారోగ్యంగా ఉన్న సమయంలో మూడు అధికార కేంద్రాలు తయారయ్యాయి. అందులో మొట్టమొదటి వ్యక్తి జయలలిత కష్టకాలంలో ఆమెకు నమ్మిన బంటుగా ఉండడమే కాకుండా ఆమె ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకొన్న రెండు సార్లూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సీనియర్ మంత్రి ఓ. పన్నీర్ సెల్వం. జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో జయలలిత చూస్తూ ఉండిన ఎనిమిది ముఖ్యమైన శాఖల వ్యవహారాలన్నిటినీ పన్నీర్ సెల్వంకే అప్పగించారు. పురచ్చితలైవికి పన్నీర్ సెల్వం ఎంతటి నమ్మిన బంటంటే జయ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండిన రెండు సార్లు కూడా ఆమె కూర్చున్న కుర్చీలో సైతం కూర్చోవడానికి సాహసించని స్వామి భక్తి పరాయణుడు.
ఇక రెండో వ్యక్తి జయలలితకు దీర్ఘకాలిక నెచ్చెలి అయిన శశికళా నటరాజన్. జయలలితకు సంబంధించిన అన్ని అవినీతి కేసుల్లోను ఆమెపై కూడా విచారణ కొనసాగింది. శశికళ మేనల్లుడ్ని దత్త పుత్రుడిగా స్వీకరించిన జయ 1995లో అతని పెళ్లిని నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరపడం అప్పట్లో పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. కాగా, జయలలిత ఆస్పత్రిలో ఉన్న అన్ని రోజుల్లోను శశికళ ఆమె పక్కనే ఉంటూ ఆమె బాగోగులన్నీ చూసే వారు.
ఇక చివరి వ్యక్తి తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ, జయలలిత ముఖ్య సలహాదారు అయిన షీలా బాలకృష్ణన్. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ కార్యకలాపాలన్నిటిలోను ఆమె మాటే చెల్లుబాటయ్యేది. అలాగే జయ ఆస్పత్రిలో ఉన్న సమయంలోను పరిపాలన సాఫీగా సాగిపోవడానికి ఆమె అన్నీ తానే అయి అధికారులను సమన్వయం చేస్తూ వచ్చారు. ఇలా ముగ్గురూ మూడు అధికార కేంద్రాలుగా మారారు. జయ అనారోగ్యం పాలయిన తొలినాళ్లలోనే ఆమె వారసులెవరన్న చర్చ జరిగినప్పుడు వినిపించిన తొలి మూడు పేర్లు కూడా వీరివే. ఇక ముందుముందు తమిళ రాజకీయం ఎలా ఉంటుందో.. ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/