అంతరిక్షంలోకి అవలీలగా ఉపగ్రహాలను - మనుషులను పంపుతున్న అధునాతన సాంకేతిక విజ్ఞానం ఒకవైపు.... మూఢ నమ్మకాలు - అంధ విశ్వాసాలు అలుముకున్న అజ్ఞానం మరోవైపు. ఇప్పటికీ దేశంలోని కొన్ని చోట్ల చేతబడి - బాణామతి చేస్తున్నారనే నెపంతో అమాయకులను బలి చేస్తున్న ఘటనలు వింటూనే ఉంటాం. ప్రజలలో ఈ మూఢ నమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తుందీ ఘటన. దేవుడు తమను పిలుస్తున్నాడంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడడం ఈ అంధ విశ్వాసాలకు పరాకాష్ఠ.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కరపలో నివసించే సత్తి ధనలక్ష్మి - సత్తి వైష్ణవి - రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు తమను దేవుడు పిలుస్తున్నాడంటూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ధనలక్ష్మి - వైష్ణవి - సత్యవతి మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు.
వారు ముగ్గురూ పూజలు చేస్తూ, దేవుడు తమతో మాట్లాడుతున్నాడని చెప్పేవారని కుటుంబసభ్యులు తెలిపారు. దేవుడు తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడని ఈ ముగ్గురు మహిళలు చెప్పేవారని పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.