40 రోజుల ముందే టిక్కెట్లు సేల్.. అదీ భారత్ -పాక్ మ్యాచ్ అంటే

Update: 2022-09-16 01:30 GMT
2022 టి20 ప్రపంచ కప్ వచ్చే నెలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ఈ టోర్నీకి తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నమెంటులో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య అక్టోబరు 23న మ్యాచ్ జరుగనుంది. అది కూడా మెల్ బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ) వంటి ప్రసిద్ధ గ్రౌండ్ లో జరుగబోతోంది. ఇంకేం అభిమానులు ఈ మ్యాచ్ ను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఈ పోటీ ఎంతగా ఉందంటే.. దాదాపు 40 రోజుల ముందే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.

రెండు నెలల్లో మూడో మ్యాచ్.. అయినా ద్వైపాక్షిక సంబంధాలు బెడిసికొట్టడంతో టీమిండియాతో పాకిస్థాన్ కు రెగ్యులర్ సిరీస్ లు లేవు. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్ తో అంతర్జాతీయ టోర్నీలు తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో ముక్కోణపు సిరీస్ లు ఎలాగూ జరిగే అవకాశం ఉండదు కాబట్టిఈ రెండు జట్లు తలపడాలంటే ఆసియా కప్, ప్రపంచ కప్ వంటి టోర్నీలే మిగిలాయి. కాగా, ఇటీవలే కప్ లో టీమిండియాతో పాకిస్థాన్ తలపడ్డాయి.

తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరిగింది. మన టీమ్.. తొలి మ్యాచ్ లో అద్భుతంగా ఆడినా, సూపర్ -4లో చతికిలపడింది. దీంతో ఫైనల్ కు చేరకుండానే నిష్క్రమించింది. ఈ రెండు మ్యాచ్ లను మైదానంలో అభిమానులే కాక టీవీల ముందు ప్రేక్షకులూ భారీఎత్తున వీక్షించారు. ఆ మ్యాచ్ లు మర్చిపోక ముందే.. అక్టోబరు 23న టీమిండియా-పాక్ తలపడుతున్నాయి. అంటే రెండు నెలల్లోనే మూడు మ్యాచ్ లన్నమాట.

అదనపు స్టాండింగ్ రూం టిక్కెట్టు ఎంసీజీ వంటి పెద్ద మైదానం నిండడం అంటే మామూలు విషయం కాదు. కానీ, అది కూడా నిండిందంటే రెండు జట్లు ఎక్కడ తలపడినా స్టాండ్స్ ఖాళీగా ఉండవని తెలిసిపోతోంది. ఎంసీజీ గ్రౌండ్ లో స్టాండ్స్ టిక్కెట్లే కాదు.. చివరికి అదనపు స్టాండింగ్‌ రూం టికెట్లు కూడా నిమిషాల్లో అమ్ముడుపోయినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. ఈ  టికెట్లు మొత్తం నిమిషాల్లో అమ్ముడైపోయాయి.

టోర్నీకి ముందు అధికారికంగా టికెట్ల రీసేల్‌ విక్రయ వేదికను ప్రారంభిస్తాం. అక్కడ అభిమానులు అసలు ధరకు టికెట్లను మార్చుకోవచ్చు’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్‌ 22వ తేదీన జరిగే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలిపింది. అంటే ఆతిథ్య దేశాల పోటీ కంటే దాయాది దేశాల మ్యాచ్ కే ఆకర్షణ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు ప్రపంచ కప్ నకు సంబంధించి ఇప్పటివరకు ఐదు లక్షల టికెట్లను విక్రయించినట్లు ఐసీసీ పేర్కొంది. మొత్తం 82 దేశాల నుంచి అభిమానులు హాజరుకానున్నట్లు చెప్పింది. 16 జట్లు పాల్గొంటాయి.

మూడేళ్ల తర్వాత మళ్లీ కళ.. మూడేళ్ల కిందటి వరకు క్రికెట్ మైదానాలు అభిమానులతో నిండేవి. కానీ, కరోనా వచ్చాక ఆ సందడి పోయింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఆంక్షల మధ్య మ్యాచ్ లు సాగాయి. అయితే, ఇప్పుడు కొవిడ్ పీడ పోవడంతో మళ్లీ మైదానాలు కళకళలాడనున్నాయి.  2020 మహిళల ప్రపంచ కప్‌ తర్వాత తొలిసారి మైదానాల్లో పూర్తి సామర్థ్యం మేరకు అభిమానులను చోటిస్తున్నారు. ఇక టి20 ప్రపంచ కప్ ఫైనల్ కు ఏకంగా 86,174 మంది నేరుగా చూడనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News