వందలాది అమాయకుల ప్రాణాలు తీసిన 1993 ముంబయి పేలుళ్లకు ప్లాన్ వేసిన వారిలో ప్రధాన నిందితుల్లో ఒకరైన టైగర్ మెమన్ కు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
రక్తపిపాసి అయిన టైగర్ మెమన్.. పేలుళ్లకు ముందు ఒక వేశ్యతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడట. ఎంతలా అంటే.. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేందుకు సైతం సిద్ధమయ్యేంత అంట. ఈ విషయాన్ని తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ బయట పెట్టింది.
వేశ్యాగృహాలకు తరచూ వెళ్లే అలవాటున్న టైగర్ మెమన్ కు సదరు వేశ్యతో పరిచయం అయ్యిందని.. అది పిచ్చి ప్రేమగా మారిందని.. ఆమె కోసం భార్యను వదిలించుకోవాలని భావించాడట. అయితే.. అదే మహిళను కిషన్ అనే మరో యువకుడు ప్రేమించటం.. ఆమె కాదంటే తనను తాను ఆత్మాహుతి చేసుకోవటానికైనా సిద్ధమేనని హెచ్చరించటంతో ఆమె.. టైగర్ కు కాస్త దూరంగా ఉందని చెబుతున్నారు.
అయితే.. టైగర్ మెమన్ లోని మరో కోణం ఏమిటంటే.. తాను అంతగా ప్రేమించే సదరు మహిళను సైతం ముంబయి పేలుళ్లకు వాడేసుకున్నారు. 1993లో పేలుళ్ల సందర్భంగా ఆమెకు సంబంధించిన కారును వాడారు. ఆ కారులో భారీగా పేలుడు పదార్థాల్ని పోలీసులు గర్తించారు. దీంతో..ఆమెను అదుపులోకి తీసుకున్న సమయంలో ఈ ప్రేమ వ్యవహారం బయటకు రావటంతో పాటు.. ఆమె ఇచ్చిన సమాచారంతోనే టైగర్ మెమన్ అకౌంటెంట్ అస్గర్ ముకద్దమ్ ను అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రేమించిన వారికి ఎలాంటి ఆపద వాటిల్లకుండా చూస్తారు. కానీ.. రక్తపిపాసి అయిన టైగన్ మెమన్ మాత్రం.. తన రక్తదాహాన్ని తీర్చుకోవటానికి.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కూడా అడ్డంగా బుక్ చేసేందుకు వెనుకాడకపోవటం గమనార్హం.