అంతలా వైరల్ అయిన టిక్ టాక్ వీడియో లో ఏముందో చూస్తే షాకే

Update: 2020-01-13 08:22 GMT
ఎక్కువసేపు సస్పెన్స్ లో ఉంచటం ఏ మాత్రం ఇష్టం లేదు. టైటిల్ సోకుతో వార్తల్ని చదివిస్తున్నారన్న అపప్రద మాకొద్దు. విషయాన్ని ఎలాంటి సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాం. ఫ్లైట్ లో వెళుతూ ఏదో ఒకటి తినే వాళ్లను చూస్తాం. కానీ.. రోటీన్ కు భిన్నంగా పచ్చి ఆకుకూరను పరా.. పరా నమిలిసిన ఒక మహిళ టిక్ టాక్ వీడియో ఇప్పుడు మస్తు వైరల్ గా మారింది.

కేవలం పదిహేను సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియోను లక్షలాది మంది పిచ్చి పిచ్చిగా చూసేస్తున్నారు. అది కూడా ఒకసారి చూసినోళ్లు.. ఆశ్చర్యంతో మరో మూడు నాలుగుసార్లు చూస్తే కానీ తనివి తీరని పరిస్థితి. విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన బ్యాగ్ లో నుంచి ఫ్రెస్ ఆకుకూర కట్టను బయటకు తీసింది. దాన్ని చాక్లెట్ మాదిరి.. ఒక బర్గర్ లా నమిలేసింది. దాన్ని టైమ్లీగా వీడియో తీసి తన టిక్ టాక్ అకౌంట్లో పోస్టు చేశారు మొల్లీ మెక్ గ్ల్యూ. ఉత్త వీడియోను పోస్టు చేయకుండా దానికి.. అయామ్ సో ఫ్రెష్ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాంగ్ మిక్స్ చేసి ప్రపంచం మీదకు వదిలాడు.

అంతే.. టిక్ టాక్ ప్రపంచం ఊగి పోతోంది. ఆ వీడియోను చూసినోళ్లు.. మళ్లీ మళ్లీ చూస్తే.. పచ్చి ఆకుకూరను ఇంతలా తినేయొచ్చా? అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి. అక్కడితో ఆగారా? తాము పొందిన ఆశ్చర్యాన్ని మిగిలిన వారు సైతం పొందేందుకు వీలుగా షేర్ చేసేవాళ్లు షేర్ చేస్తే.. తమ కామెంట్లతో మెసేజ్ బాక్స్ ను తన సందేశాలతో నింపేస్తున్నారు.
Tags:    

Similar News