దేశంలోని సుపరిచిత వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపునకు సంబంధించిన వివాదంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టాటా సంస్థల్లో మైనార్టీ వాటా అయిన మిస్త్రీ ఫ్యామిలీ టాటాతో తమకున్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకొనేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టాటా కంపెనీలో పల్లోంజీ మిస్త్రీ.. ఆయన కుటుంబానికి చెందిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూపునకు 18.37 శాతం వాటా ఉంది.
2016లో పల్లోంజీ తనయుడు సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్ గా తొలగించిన నాటి నుంచి టాటా కుటుంబానికి.. మిస్త్రీ ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఆస్తుల అమ్మకం నిలిచిపోవటంతో.. బాండ్ల చెల్లింపులు చేసేందుకు టాటా సన్స్ లో తన మైనార్టీ వాటాను తనఖా పెట్టటం ద్వారా రూ.11వేల కోట్లను సమీకరించే యోచనలో మిస్త్రీ ఫ్యామిలీ ఉంది.
దీనిపై టాటా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఒకవేళ.. తమకు అవసరమైన నిధుల కోసం టాటాలో తమకు మైనార్టీ వాటాను అమ్మాలని భావిస్తే.. దాన్ని కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టాటా పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివాదంపై తాజాగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మిస్త్రీ కుటుంబానికి చెందిన వాటాను కొనుగోలు చేయటానికి తాము సిద్దమని టాటా సన్స్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
మిస్త్రీ గ్రూపునకు షేర్ల తనకా ద్వారా నిధులు సమీకరించాలనుకుంటే.. ఆ షేర్లు ఎవరి చేతుల్లోకి అయినా వెళ్లే ప్రమాదం ఉందని టాటా గ్రూపు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుప్రీం కీలక ఆదేశాల్ని జారీ చేసింది. అక్టోబరు 28 వరకు సాపూర్ జీ పల్లోంజీ గ్రూపు.. సైరస్ మిస్త్రీ కానీ ఆయన పెట్టుబడి సంస్థలు కానీ టాటా సన్స్ షేర్లను తనకా పెట్టటం కానీ.. బదిలీ చేయటం లాంటివేమీ చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. ఇదే సమయంలో టాటాల నుంచి తప్పుకునే సమయం వచ్చిందని పేర్కొంటూ మిస్త్రీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. దీంతో.. టాటాల నుంచి మిస్త్రీ ఫ్యామిలీ తన సుదీర్ఘ అనుబంధానికి తెగతెంపులు చేసుకోవటానికి సిద్ధమైనట్లుగా చెప్పక తప్పదు.