తిరుపతి. అంతర్జాతీయంగా చూస్తే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. ఆ దేవదేవుడిని జీవితంలో ఒకసారి అయినా దర్శించుకోవాలని ఆరాటపడని భక్తుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. తిరుపతికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అటువంటి తిరుపతి మన రాజధాని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. తిరుపతిని ఎంచక్కా రాజధానిని చేయండి, ఇక అభివృద్ధిని చూసుకోండి అంటున్నారు ఆయన.
ఇంతకీ తిరుపతిని రాజధానికి ఎందుకు చేయాలో కూడా చింతా మోహన్ ఎవరికీ ఏ చీకూ చింతా లేకుండా వివరిస్తున్నారు. తిరుపతి ఇంటర్నేషనల్ సిటీ. అలా అది అందరికీ తెలుసు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అలాగే తిరుపతి చుట్టూ ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి. సో అద్భుతమైన కనెక్టివిటీ ఇటు విజయవాడ, అటు బెంగుళూరు, ఇటు హైదరాబాది, చెన్నై ఇలా అన్ని వైపులకు ఉందని ఆయన చెబుతున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే కొత్త రాజధాని నగరానికి ఎలాంటి నీటి కొరతా లేకుండా కండలేరు, సోంశిల రిజర్వాయర్లు ఉన్నాయని చెబుతున్నారు. మరో వైపు రాజధానికి అవసరం అయిన ప్రభుత్వ భూమి ఏకంగా లక్షన్నర ఎకరాలు అందుబాటులో ఉందని లెక్కలు తీసి మరీ వివరించారు. అది కూడా ఎక్కడో మూలన కాదు, ఏర్పేడు నుంచి రావూరు దాకా విస్తరించి ఉందని కూడా ఈ కాంగ్రెస్ సీనియర్ నేత చక్కగా విశ్లేషిస్తున్నారు.
ఇక అన్నింటి కంటే మరో ముఖ్యమైన అంశాన్ని ఆయన చెబుతున్నారు. అదేంటి అంటే తిరుపతి పదమూడు జిల్లాలకు అందుబాటులో ఉండే నగరం అని. నిజంగా చూస్తే ఉత్తర కోస్తాకు తిరుపతి దూరం అయినా కానీ ఎవరూ తిరుపతికి రావడాన్ని భారంగా అనుకోరు. అది దేవదేవుని సన్నిధానం కాబట్టి శ్రమను మరచి మరీ వస్తూంటారు. అలాగే తిరుపతి టూర్ ని అంతా ఎంజాయ్ చేస్తారు.
ఆ విధంగా చూస్తే తిరుపతితో ఏపీలోని పదమూడు జిల్లాల వారికీ ఎమోషనల్ కనెక్టివిటీ ఉందనుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే అసలు మళ్లీ రాజధాని నినాదం రాజుకోవడం ఏంటి అన్నదే చర్చ. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంతా కూడా అమరావతి రాజధాని అనే కదా మాట్లాడుతున్నారు. ఇటీవల తిరుపతిలో అమరావతి రైతుల సభ జరిగితే కాంగ్రెస్ కి చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి, మస్తాన్ వలీ లాంటి వారు అమరావతే ఏపీకి అసలైన రాజధాని అని చెప్పారు కదా.
మరి చింతా మోహన్ ఏంటి ఇలా భిన్న వాదనలు వినిపిస్తున్నారు అంటే మరి ఆయన స్టైలే అది అనుకోవాలా లేక కాంగ్రెస్ లో కూడా అమరావతి మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అనుకోవాలా అన్నదే అర్ధం కాని విషయం. ఇక పోతే అమరావతి రాజధానికి 2015 దసరా రోజున ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. కానీ ఆ పునాది రాయి అనాధ అయిందని చింతా మోహన్ అంటున్నారు. దాని అర్ధం రాజధాని అక్కడ కాదని చెప్పడమే.
తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేసినా అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఆయన సెలవిస్తున్నారు. మరి దీని భావమేంటి అంటే ఎవరికి వారే ఆలోచించుకోవాలి. మొత్తానికి చింతా మోహన్ రాజధాని మీద సరికొత్త చింతలు చికాకులు కలిగేలా మరీ ముఖ్యంగా అమరావతి రైతుల మదిలో అలజడి రేగేలా తిరుపతిని తెచ్చి ముందు పెట్టారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.