ఐటీ మంత్రి తొలగింపు.. గవర్నర్ సంచలనం

Update: 2019-08-08 07:00 GMT
తమిళనాట అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు చేశారా లేదా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారా అన్న విషయంలో స్పష్టత లేదు కానీ ఏకంగా ఐటీ మంత్రిని గవర్నర్ భర్తరఫ్ చేయడం వివాదాస్పదమైంది.

తాజాగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తమిళనాడు కేబినెట్ లోని ఐటీ శాఖ మంత్రి ఎం మణికందన్ ను తొలగించడం సంచలనంగా మారింది. అయితే ఉన్న ఫళంగా ఇలా మంత్రిని తీసేయడానికి గల కారణాలు మాత్రం బయటకు వెళ్లడి కాలేదు.

కాగా ఐటీ మంత్రి తొలగింపు వ్యవహారంపై తమిళనాడు గవర్నర్ రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. సీఎం ఫళనిస్వామి సూచనల మేరకే ఐటీ మంత్రిని తొలగించామని ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా దీనిపై సీఎం ఫళని స్వామి కానీ.. తమిళనాడు సీఎంవో కార్యాలయం కానీ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు - ధ్రువీకరించలేదు. దీంతో కేంద్రం ప్రోత్సాహంతో గవర్నర్ ఐటీ మంత్రిని భర్తరఫ్ చేశాడా అన్న అనుమానాలు తమిళనాట బలపడుతున్నాయి.

గడిచిన పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడులో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిగాయి. వేలూరులో కోట్ల కట్టలు బయటపడ్డాయి.అక్కడ ఎన్నికను కూడా ఈసీ రద్దు చేసింది. ఐటీ మంత్రి మణికందన్ ఆదేశాల మేరకే ఈ ఐటీ దాడులు జరిగాయన్న అనుమానాలు కలిగాయి.. లేదంటే కేంద్రం సూచనలతో ఈ దాడులు చేశారా అన్న అనుమానాలున్నాయి. ఈ విషయంలో మణికందన్ హ్యాండ్ ఉందన్న కారణంతోనే అతడిని తొలగించారా అన్న చర్చ జరుగుతోంది. అయితే అధికారికంగా ఎందుకు మంత్రిని తొలగించారనే విషయంపై స్పష్టత లేదు.


Tags:    

Similar News