సంచలనం సృష్టించిన శ్రీలంక ఈస్టర్ సండే చర్చి పేలుళ్ల విషయంపై అనూహ్య ఆరోపణలు చేశారు ఆ దేశ ఆర్మీ చీఫ్. శ్రీలంకలో ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ముందు భారత్ లోని కశ్మీర్.. బెంగళూరు.. కేరళ రాష్ట్రాలకు వెళ్లారని.. అక్కడ నుంచి శ్రీలంకకు వచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు.
దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని ఆయన చెబుతున్నారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ మహేష్ సేననాయకే మాట్లాడుతూ.. ఈ సంచలన విషయాల్ని చెప్పారు. అయితే.. ఉగ్రవాదులు భారత్ కు ఎందుకు వెళ్లారన్న విషయం మీద ఇంకా స్పష్టత రాలేదన్నారు.
అయితే.. భారత్ లో శిక్షణ పొందేందుకు వెళ్లారా? అన్న అనుమానం వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. భారత్ తో పాటు ఇతర దేశాల నుంచి ఉగ్రదాడులపై ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందా? అని ప్రశ్నించినప్పుడు బదులిచ్చిన మహేశ్ సేన నాయకే.. భారత జాతీయ విచారణ సంస్థ తమిళనాడులోనూ.. కేరళలోనూ కొన్నిచోట్ల దాడులు చేసినట్లు చెప్పారు.
దాడులకు సంబంధం ఉన్న రియాస్ అబూబకర్ ను అరెస్ట్ చేయటంతో పాటు.. తమిళనాడులో ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్స్ ను ఆపరేట్ చేస్తున్నట్లుగా ఎన్ ఐఏ తెలిపింది. ఈస్టర్ సండే నాడు శ్రీలంక చర్చితో పాటు..పలు స్టార్ హోటళ్లతో పాటు.. వివిధ ప్రాంతాల్లో జరిపిన బాంబుపేలుళ్లలో వందలాది మంది మరణించారు. శ్రీలంక దేశ చరిత్రలో ఇలాంటి ఉగ్రదాడి జరగటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.