రాజకీయాలు అన్నాక సవాలచ్చ ఉంటాయి. అప్పటివరకు జాన్ జిగిరీలు అనుకున్నోళ్లు సైతం అగర్బ శత్రువుల మాదిరి కొట్లాడుకోవటం.. అప్పటివరకు కత్తులు దూసుకున్న వారు.. కౌగిలించుకోవటం లాంటి సన్నివేశాలు రాజకీయ రంగంలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. తెలుగు రాజకీయాల్లో ఇప్పటివరకు ఎప్పుడూ.. ఎవరూ చూడని కొత్త తరహా రాజకీయాన్ని నేర్పిన ఘనత మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని చెబుతారు. ఆ పార్టీకి సంబంధించిన అంశాలపై విపక్ష నేతలు చాలానే చెబుతారు. వారి మాటల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఆ పార్టీని.. పార్టీ అధినేత జగన్ ను అమితంగా ఆరాధిస్తూ.. తనకంటే తోపు భక్తుడు లేడన్నట్లుగా వ్యవహరించి.. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని తన వ్యక్తిగత ప్రత్యర్థుల మాదిరి ఫీలై.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే వైసీపీ నేతలు చాలామందే ఉన్నారు.
అలాంటి నేతల్లో టాప్ ఫైవ్ నేతలు ఎవరన్న ప్రశ్న వేసినప్పుడు.. థర్టీ ఇయర్స్ ఇండ్టస్ట్రీగా పేరొందిన పృథ్వీని ఇట్టే గుర్తుకు తెచ్చేసుకుంటారు. టీటీడీ చానల్ ఎస్వీబీసీకి ఛైర్మన్ గా వ్యవహరించి.. అందులో పని చేసే మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడినట్లుగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్ తో ఛైర్మన్ పదవి పోవటమే కాదు.. వైసీపీ వదిలేసింది. ఆయన నోటి పుణ్యమా అని.. సినిమా ఇండస్ట్రీ ఆయన్ను పట్టించుకున్నది లేదు. నోరుంది కదా అని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మీద టార్గెట్ వ్యాఖ్యలు చేసేవారు. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత మరింతగా రెచ్చిపోయిన ఆయన.. ఎంతేసి మాటలు మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఎంత ఎక్కువగా తిడితే అంతలా సీఎం జగన్ కంట్లో పడొచ్చన్న ఆలోచనతో.. నోటికి బాగానే పని చెప్పేవారు. చివరకు అమరావతి రైతుల ఆందోళనలోనూ వేలెట్టేసిన ఆయన.. వారిని.. వారు చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేస్తూ దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన ఆయన.. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి పోయి.. మాజీగా మారిన తర్వాత నుంచి ఆయన్ను ఆ పార్టీ వదిలేసింది. అప్పటి నుంచి తత్త్వం తెలుసుకున్న ఆయన.. నోటికి పని చెప్పకుండా.. అప్పట్లో అనేసిన మాటలకు పశ్చాతాపం చెందుతూ.. తనను క్షమించాలని చెప్పుకుంటున్నారు.
అలాంటి ఆయన తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వైసీపీ గురించి.. ఆ పార్టీ తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నింటికి మించి వైసీపీని ఉద్దేశించి ఉగ్రవాద శిక్షణ శిబిరం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దానికి జస్టిఫికేషన్ ఏమిటి బాబు అన్న మాటకు ఆయన ఇచ్చిన సమాధానం విస్మయానికి గురి చేసేలా మారింది. వైసీపీ అధినేత.. ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాను ఎక్కువగా కలిసేవాడినని.. ఆయనతో కూర్చొని టీ.. కాఫీ తాగేవాడినన్న విషయాన్ని వెల్లడించారు.
అదే సమయంలో వైసీపీ గురించి వ్యాఖ్యానిస్తూ.. ‘‘జగన్ ను తరచూ కలిసేవాడ్ని. పాదయాత్రలో కూడా పాల్గొన్నా. ఎవరెస్టు శిఖరం ఎక్కిన హిల్లరీ కన్నా గొప్పోడ్ని అన్న ఫీలింగ్ ఉండేది. ఆ ఉగ్రవాద శిక్షణ శిబిరం ప్రభావం అది. దాంతో నా స్థాయి మరిచి.. పవన్ కల్యాణ్ గారిని.. ఆయన పార్టీనీ.. నాగబాబుగారిని.. జనసైనికుల్నీ.. టీడీపీ మీద ఏది పడితే అది మాట్లాడేశా. వాళ్లంతా దాన్ని చాలా సహృదయతతో తీసుకొని వదిలేశారు. లేకపోతే ఈ పృథ్వీరాజ్ వెళ్లిపోయి మూడేళ్లు అయి ఉండేది. 2020లో నన్ను పలుకరించిన వాళ్లు ఎవరూ లేరు.
అప్పుడు లాక్ డౌన్. సినిమాలు లేవు. ఉగ్రవాద శిబిరాల నుంచి కోట్లు వచ్చేశాయని బయట టాక్. కానీ జేబులో డబ్బుల్లేవు. సెంటర్లో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉండేది. దాంట్లోకి వెళ్లి టిఫిన్ తినేవాళ్లం. భోజనం అక్కడే. మిగిలిన వాళ్లు ఎలా సంపాదించుకున్నారో తెలీదు. లౌక్యం సినిమాలో నటించాను కానీ నాకు లౌక్యం లేదు’ అంటూ ఓపెన్ అయ్యారు. రీల్ జీవితాన్ని తలపించే రియల్ లైఫ్ ను కళ్లకు కట్టినట్లుగా చెప్పటమే కాదు.. అన్నింటికి మించిన తాను చేసిన వ్యాఖ్యల వెనకున్న శక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాబోయే రోజుల్లో పృథ్వీరాజ్ మాదిరి బయటకు వచ్చి ఓపెన్ అయ్యే వారి నోటి నుంచి మరెన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో?