ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్ వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. 1981నుంచి నట్టి కుమార్ కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీతో కాంగ్రెస్ సామీప్యంగా ఉండడం.. చీకటి ఒప్పందం చూసి నచ్చకనే తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆంధ్ర ప్రజలను కొడుతున్నారన్న వ్యాఖ్యలను నట్టికుమార్ ఖండించారు. పవన్ కు ఎవరు చెప్పారో తెలియదు కానీ తెలంగాణలో ఆంధ్రప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. అనవసరంగా ప్రజల మధ్య విద్వేశాలు పవన్ కల్యాణ్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను కూడా నట్టికుమార్ స్పందించారు. టీడీపీకి ఓటు వేయకపోతే పసుపు కుంకాలు పోతాయం అనడం దారుణమన్నారు. ఆయన నీచంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీని ఫిర్యాదు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్ , కేఏ పాల్ లను వాడుకుంటున్నారన్నారు. ఎన్నికుట్రలు చేసినా ఏపీలో అధికారంలోకి రాబోయేది వైఎస్ జగనే అని స్పష్టం చేశారు.
ఏపీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని.. ఆయన ఒక్కరే కులమతాలకు అతీతంగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు ఒక్క అమరావతినే అభివృద్ధి చేస్తున్నారని.. ఇతర ప్రాంతాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు.