రీల్ హీరో "రియల్"గా మోసపోయాడు!

Update: 2015-05-09 10:39 GMT
మోసపోవడానికి కాదెవరూ అనర్హం అన్న సూత్రం... రియల్ మోసాల బారిన పడటానికి కూడా వర్తిస్తుంది! హైదరబాద్ వేదికగా జరుగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా మోసాలు అన్నీ ఇన్నీ కాదనే చెప్పాలి! సామాన్యులు కొనుక్కునే 50 - 100 గజాల స్థాలాల నుండి బడాబాబులు కొనుక్కునే కోట్ల ఖరీదైన స్థాలాల వరకూ అన్నింటిలోనూ ఈ రియల్ మాఫియా కచ్చితంగా ఉంటుంది! అది బంజర భూమా, బంజారాహిల్స్ లో భూమా అనే తేడా వారికి లేదు! ఇలా రియల్ మాఫియా బారిన పడినోళ్లలో సామాన్యులూ ఉన్నారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ ఉన్నారు, సినిమా వాళ్లూ చేరి చాలాకాలమే అయ్యింది! తాజాగా ఆ సినిమావాళ్ల లిస్ట్ లో ఒక యువనటుడు చేరాడు!
విషయంలోకి వస్తే... బంజారాహిల్స్ లో సుమారు ఐదు కోట్ల రూపాయలతో భూమిని కనుగోలుచేశాడు ఒక యువనటుడు! ఆ ఆనందంలో భూమి పూజకు సిద్ధపడుతుండగా... ఆపండీ... అనే శబ్ధం వినిపించింది! వెనక్కి తిరిగిచూసే సరికి "ఈ స్థలం నాది" అంటూ మరో వ్యక్తి సేం టూ సేం పత్రాల్తో వచ్చి నిలబడ్డాడు! దీంతో షాక్ తిన్న హీరో... నిజంగానే తాను మోసపోయానో లేదో అని తెలుసుకునేందుకు ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి మరీ డాక్యుమెంట్లు పరిశీలన చేయించాడు! దీంతో తనవద్ద ఉన్న పత్రాలు నకిలీవని తెలియడంతో తలపట్టుకుని కూర్చున్నాడు! ఎంతో కష్టపడి సంపాదించిన ఐదు కోట్లు పోయాయంటూ సన్నిహితల వద్ద కన్నీరు మున్నీరవుతున్న ఈ యువనటుడు... ఈ విషయంపై లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం!
Tags:    

Similar News