ఆ హీరో, ఆయన భార్యకు కరోనా వైరస్?

Update: 2020-03-12 04:04 GMT
ప్రముఖ హీరో, ఆయన భార్యకు కరోనా సోకింది. ఈ వార్త విని సినీ ప్రపంచమే అల్లకల్లోలమైంది. అభిమానులు కలవరపడుతున్నారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వీరిద్దరూ త్వరగా బయటపడాలని పూజలు చేసుకుంటున్నారు.

హాలీవుడ్ ప్రముఖ హీరో టామ్ హాంక్స్(63), ఆయన భార్య రీటా విల్సన్ (63) జంటకు కరోనా వైరస్ సోకింది. తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్న వీరు వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్ సోకినట్టు తేలింది.

ఈ విషయాన్ని టామ్ హ్యాంక్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో సినీ ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘రీటా, నేను ఆస్ట్రేలియాలో ఉన్నామని.. ఆలసట, జలుబు, జ్వరం , ఒళ్లు నొప్పులు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల ప్రకారం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాం.. మీరంతా జాగ్రత్తగా ఉండండి’ అంటూ హీరో టామ్ హ్యాంక్స్ ట్వీట్ చేయడంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా కలవరపడింది.

హాలీవుడ్ స్టార్ జంటకు కరోనా అని తేలడంతో వారు కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. వారికి ట్విట్టర్ లో భరోసాగా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికాలోని కాలిఫోర్నియా లో టామ్ జన్మించారు. ‘స్ప్లాష్, బ్యాచిలర్ పార్టీ, బిగ్, ఫారెస్ట్ గంప్, ది టెర్మినల్, అపోలో’ సహా పలు చిత్రాల్లో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. హాలీవుడ్ సినీ ప్రపంచంలో తొలి కరోనా సోకిన హీరోగా టామ్ నిలిచాడు.
Tags:    

Similar News