Top news:ఈరోజు ముఖ్యాంశాలు

Update: 2019-01-07 11:30 GMT
*అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సోమవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది

*నిమ్మకూరులో తన తల్లి తండ్రులు ఎన్టీఆర్ - బసవతారకం విగ్రహలకు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.

* వైఎస్ ఆర్ బయోపిక్ ‘యాత్ర’ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది

* నాగబాబు మరోసారి బాలయ్య డైలాగులపై విరుచుపడుతూ వీడియో విడుదల చేశారు.

*తెరాసతో ఉత్తమ్ కూమర్ రెడ్డి కుమ్మక్కు అయ్యారని సర్వేసత్యనారాయణ వాఖ్యానించారు వెంటనే పదవి నుంచి తప్పకోవాలని డిమాండ్ చేశారు.

* ఆస్ట్రేలియాపై విజయం సాధించిన అనంతరం అనుష్క శర్మ మైదానంలోకి వచ్చి  మై లవ్ అంటూ  భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని హత్తుకొని అభినందించారు.

*నటి తో డేటింగ్ విషయమై పాండ్య  సమాధానమిచ్చాడు. రిలేషనషిప్ లో కమిట్మెంట్ చాలా అవసరం అని తెలుసుకున్నా అంటూ మాట దాటేశాడు.

*ఐటి చట్టంలోని తొలగించిన సెక్షన్ కింద దేశంలో అరెస్టులు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

* నిర్మాత బన్నీ వాస్ తన ట్విట్టర్ లో స్పందించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన ప్రసన్న కుమార్ ను ఉద్దేశించి హెచ్చరిస్తున్నట్టుగా మెసేజ్ పెట్టిన బన్నీ వాస్ తమ సహనం కోల్పోయే దాకా పరిస్థితిని తీసుకొస్తున్నారని సంస్కారం అనే హద్దును దాటితే పరిణామాలు వేరుగా ఉంటాయని నేరుగా వార్నింగ్ ఇచ్చేసారు.

*లోక్ సభా కార్య్రక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ నలుగురు ఎంపీలను స్పీకర్ సుమాత్రా మహజన్ సస్పెండ్ చేశారు.

*తెలంగాణ అసెంబ్లిలో ఆంగ్లో ఇండియన్ శాసన సభ్యుడిగా స్టిఫెన సన్ ను నియమించాలని తెలంగాణ  మంత్రివర్గం కేసీఆర్ నిర్ణయించారు..

* అసభ్య పాటలకు నృత్యాలు చేయించి మత్తు ఇచ్చి నట్లు ముజఫర్ ఫూర్ కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.

*కోహ్లిసేనపై ప్రశంసల వర్షం ప్రతి భారతీయుడినీ  గర్వపడేలా చేశారని ప్రధాని సహా సీఎంలు, వివిధ ప్రముఖులు అభినందించారు.

 *ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది. హోంమంత్రి మహమూద్ అలీ - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి - ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు

*నా సినిమాని థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు. యువి క్రియేషన్స్ అల్లు అరవింద్ దిల్ రాజు.. వీళ్లంతా థియేటర్లతోనే పుట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. పేట చిత్రానికి థియేటర్లు ఇవ్వడానికి వీళ్లకు నొప్పేంటి? వందలాది థియేటర్లలో ఒకే సినిమాని వేసి మంచి సినిమా వచ్చినప్పుడు ఇవ్వకుండా నాటకమాడతారా? .. వీళ్లు వేసే సినిమాలే చూడాలా?  వీళ్లు రుద్దేసేవే చూడాలా? ఈ కుక్కలకు బుద్ధి చెబుదాం.. అంటూ నిర్మాత అశోక్ ఫైరయ్యారు.

* పేట వేడుకలో టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``నేడు థియేటర్ మాఫియా.. మాఫియా డాన్ ల కన్నా దారుణాతి దారుణంగా ఉంది. ముగ్గురు నలుగురు మాత్రమే వాళ్లు చేసే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సంక్రాంతికి ఆరు నుంచి ఏడు సినిమాలు విడుదలైన సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. చూడాలనుకునే ప్రేక్షకులు ఉన్నారు. అయితే కొన్ని ఏరియాల్లో కేవలం ఒకట్రెండు సినిమాలకే థియేటర్లను కేటాయించారు. అదొక మాఫియాలాగా తయారైంది. అలాంటి మాఫియా అంతమయ్యే పరిస్థితి వస్తుంది

 * దాదాపు 20 ఏళ్లనుంచి టీడీపీలో ఉన్నా. ఇప్పుడు కూడా ఇంకా కార్యకర్తగానే ఉండాలంటే కష్టం. నా దేశం కోసం ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అలా చెయ్యాలంటే పదవి ఉండాలి. ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానంటేనే ఎమ్మెల్యే గా పోటీ చేస్తా. ఒక వేళ ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినా సరే నాకేం అభ్యంతరం లేదు. అది మాట నోటిమాటతో చెప్తే కాదు..లిఖిత పూర్వకంగా రాసి ఇస్తేనే. అలా ఎవరు ఇస్తారో వాళ్ల పార్టీలోనే చేరతా” అని క్రిస్టల్‌ క్లియర్‌ గా చెప్పారు అలీ.

*సుశాంత్ సింగ్ హీరో ‘సోన్ చిడియా’ ట్రైలర్ విడుదలై సంచలనం రేపుతోంది.

*16 గంటల్లోనే 21వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి పోలవరం ప్రాజెక్టు గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.

*ఏపీకి వ్యతిరేకంగా మోడీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి ఆనందబాబు ఆరోపించారు.

*ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ గురించి గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ బయోపిక్ తెరకెక్కనుందని వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర పోషిస్తారని ప్రచారమైంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. నరేంద్ర మోదీగా ఒబేరాయ్ లుక్ ఎలా ఉంటుందో పోస్టర్ ద్వారా రివీల్ చేసారు.

* రక్షణ మంత్రి నిర్మలా పార్లమెంట్ లో అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

*వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత గడ్కరీ హంగ్ రావాలని ఎదురుచూస్తున్న శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది.
Tags:    

Similar News