Top News: ఈ రోజు ముఖ్యాంశాలు

Update: 2019-01-08 12:34 GMT
*అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచారని.. స్వీట్లు ఏవీ అంటూ ప్రధాని మోడీ తనను కలిసిన టీఆర్ ఎస్ ఎంపీలతో సరదాగా వ్యాఖ్యానించారు.

* బాలయ్యపై నాగబాబు కౌంటర్లపై వివాదాస్పద రాంగోపాల్ వర్మ స్పందించారు. తన అన్నలపై ప్రేమను నాగబాబు ఇలా తెలియజేస్తున్నాడని తెలిపారు.

*అప్పు చెల్లింపు విషయంలో ఎరిక్సన్ వేసిన పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు అనిల్ అంబానీ నోటీసులకు స్పందించనందుకు కోర్టు ధిక్కార నోటీసులు పంపింది.

*జపాన్ ఫ్యాన్స్ కు బాహుబలి ప్రభాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. న్యూ ఇయర్ కానుకగా అక్కడ తన సినిమా హిట్ చేసినందుకు గ్రీటింగ్ కార్డులు, కొత్త ఫొటోలను కానుకగా ఇచ్చాడు.

*కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లుపై సవరణలు కోరాలని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తన ఎంపీలను కోరారు.

* బాలయ్య కుమారుడు మోక్షజ్ఞను తాను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్న వార్తలు అవాస్తవం అని దర్శకుడు బోయపాటి శ్రీను స్పష్టం చేశారు.

*పెళ్లికి ఖర్చు చేస్తున్నప్పుడు సినిమాకు చేయాలని .. ప్రతి సినిమా తనకు కూతురు లాంటిదని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన సినిమాల ఓటమిపై హాట్ కామెంట్ చేశారు.

*కర్నూలు ఎయిర్ పోర్టు - క్యాన్సర్ పరిశోధన కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు.

*సైరాలో నటించినందుకు గాను నాన్న చిరంజీవికి ఎవ్వరూ ఇవ్వలేనంత పారితోషికం ఇచ్చానని మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్నారు.

*సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు వైసీపీ పార్టీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు సీటు ఇవ్వనందుకు పార్టీకి రాజీనామా చేశారు.

* ఆస్ట్రేలియాతో జరిగే వన్డే, న్యూజిలాండ్ పర్యటనలకు స్టార్ బౌలర్ బూమ్రాకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు చాన్స్ ఇచ్చింది.

*ఎన్టీఆర్ సినిమా గురించి బాలయ్య వ్యాఖ్యానించారు. నాన్న ఎన్టీఆర్ గురించి తెలియనవి చూపిస్తామని మీడియాతో వ్యాఖ్యానించారు.

*లోక్ సభలో ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదించిన అగ్రవార్ణాలకు రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి థావర్ ప్రవేశపెట్టారు.

*ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గా భారత్ కు చెందిన గీతా గోపినాథ్ ఎంపికయ్యారు.

*ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నుంచి  కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అన్న డైలాగ్ అందులో వినిపించింది.

* వైసీపీ అధినేత జగన్ సీఎం సీటు ఆశలు నెరవేరవని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.

* తన తండ్రి రాకేష్ రోషన్ కు గొంతు క్యాన్సర్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తెలిపారు.

*సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ గా తొలగించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. తిరిగి ఆయన్ను నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

*అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లపై దళిత నేత, బీఎస్పీ అధినేత్రి మాయవతి స్వాగతించారు.

*భారతీయ హాల్ ను వదిలి విదేశీ డసోకు - అనిల్ అంబానీకి మేలే చేసేలా రాఫెల్ కాంట్రాక్టును మోడీ కట్టబెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

*కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు చేసిన భారత్ బంద్ ఈరోజు విజయవంతమైంది.

*అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.

*యూపీలో దారుణం జరిగింది. యూపీ బీజేపీ నాయకుడు నితిన్ అగర్వాల్ ఓ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆహార ప్యాకెట్లలో మద్యం - బాటిల్లు పంచడం దుమారం రేపింది.

* సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్ లో ఐపీఎల్ జరగదన్న వదంతులకు చెక్ పెడుతూ బీసీసీఐ భారత్ లోనే నిర్వహిస్తున్నట్టు షెడ్యూల్ ప్రకటించింది.

*రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్  నుండి 'ఎందుకు?' అనే సాంగ్ రిలీజ్ చేసాడు. ఆ సాంగ్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది


Tags:    

Similar News