Top News: ఈరోజు ముఖ్యాంశాలు

Update: 2019-01-11 11:30 GMT
1. ఈరోజు రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తీసిన ‘వినయ విధేయ రామ’ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మాస్ - యాక్షన్ ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది.

2.సుప్రీం కోర్టులో పోరాడి సీబీఐ డైరెక్టర్ గా నియామకమైన అలోక్ వర్మ.. మోడీ మరోసారి తనను తొలగించడంతో మనస్థాపం చెంది తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మోడీపై తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

3.  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావును తమకు అప్పగించాలని ఎన్ఐఏ పిటీషన్ వేసింది. విచారణను ఈనెల 25కు కోర్టు వాయిదావేసింది.

4.ఈరోజు దర్శకుడు సుకుమార్ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మన కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.

5.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎస్పీ - బీఎస్పీ పొత్తుపై అఖిలేష్ - మాయావతి కీలక ప్రకటన చేయబోతుండడం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

6. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీని చూసి చంద్రబాబు హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్ లను సన్మానించి సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.

7.టీవీ షోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు పాండ్య, రాహుల్ లను తప్పుపట్టారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ కు వారి వ్యాఖ్యలతో సంబంధం లేదన్నారు.నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

8. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు లేనట్లేనని రాహుల్ తో భేటి తర్వాత బాబు సంకేతాలిచ్చారు. ఈ మేరకు టీటీడీ నేతలు తాజాగా ధ్రువీకరిస్తున్నారు.

9.మేఘాలయాలోని గనిలో చిక్కుకుపోయిన 15మంది కూలీలు కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగించాలని సుప్రీం కోర్టు కేంద్రరాష్ట్రాలను ఆదేశించింది. నెలరోజులుగా వారు గనిలోనే చిక్కుకొని పోయారు.

10.సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్తానాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ పెట్టుకున్న పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయనపై విచారణ జరపాలని ఆదేశించింది.

11.మన్మోహన్ అసమర్థ ప్రధాని అంటూ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ’ పేరుతో తీసిన మూవీ ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దీనిపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. ఆపడానికి ప్రయత్నించింది. సినిమా సాదాసీదాగానే ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమైంది. కీలక విషయాలు ఇందులో చూపించలేదు.

12. పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై అవినీతి ఆరోపణలు రావడం.. ఆయన మనస్థాపంతో కాంగ్రెస్ కాడి వదిలి యూరప్ వెళ్లిపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది.  పీసీసీ చీఫే లేకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే కరువయ్యారు.

13. మల్కాజిగిరి - సికింద్రాబాద్  పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి వారికే టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

14.సీఎం కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని.. వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందని కుమారస్వామి భావోద్వేగానికి గురై జేడీఎస్ ఎమ్మెల్యేల ముందర మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.

15.చండీఘడ్ ఎంపీ కిరణ్ ఖేర్ అగ్రవర్ణాలకు బిల్లు సందర్భంగా చర్చలో మాట్లాడుతూ హాస్యాస్పదంగా ప్రవర్తించారు. ఖేర్ నవ్వుతూ.. ఎవరికో సైగలు చేస్తూ.. మరో సభ్యుడితో మాట్లాడుతూ కనిపించడం వైరల్ గా మారింది. ఆమెపై నెటిజన్లు, ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

16.రాహుల్ గాంధీకి నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు పలికారు. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో రాహుల్ తప్పేమి లేదని.. మోడీదే తప్పు అని పునరుద్ఘాటించారు.

17. అశ్వరావుపేట ఎమ్మెల్యే నాగాశ్వరరావు తుమ్మలతో భేటిపై క్లారిటీ ఇచ్చారు. తాను టీఆర్ ఎస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవాలు అని స్పష్టం చేశారు. తాను టీడీపీని వీడనని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి తుమ్మల తనకు రాజకీయ గురువు అని.. ఆయన శిష్యుడిగా మర్యాద పూర్వకంగానే కలిసినట్టు వివవరించారు.

18.తమిళనాడులోని ఐదు జిల్లాలకు చెందిన బూత్ స్థాయి కార్యకర్తలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో   పొత్తులకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.

19.మాది కోడికత్తి పార్టీ అంటూ విమర్శిస్తున్న టీడీపీ నాయకులు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన మీది కట్టప్ప కత్తి పార్టీనా అని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. 

20. మహ్మద్ గైని అనే బంగ్లాదేశ్ వ్యక్తి మూడు సార్లు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాలని చూశాడు. అతడు కిడ్నీ అమ్ముకుందామని మరోసారి రాగా పోలీసులు పట్టుకున్నారు. ఇది సంచలనంగా మారింది.

21. క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘గోడకు మంచి మనసు, హృదయం ఉందని క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

22.అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరిగింది. దీంతో దేశంలో పెట్రోల్ధర రూ.69రూపాయలు దాటింది.

23. రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలు 2020కి అందుబాటులోకి తెస్తున్నట్లు ఉబర్ అనుబంధ సంస్త ‘బెల్ నెక్సస్’ తాజాగా ప్రకటించింది. సీఈఎస్ సాంకేతిక ప్రదర్శనలో వాహన నమూనాను తాజాగా ఈరోజు ఆవిష్కరించారు.

24.శబరిమల ఆలయంలోకి ప్రవేశించి కలకలం రేపిన ఇద్దరు బిందు, కనకదుర్గ మహిళలు అజ్ఞాతంలోకి వెల్లిపోవడం.. కనిపించకపోవడం కలకలం రేపుతోంది.

25.ఆస్ట్రేలియాను తక్కువ అంచనావేయవద్దని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే భారత్ క్రికెటర్లకు హితవు పలికారు.
Tags:    

Similar News