కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘తేజస్ ఎక్స్ ప్రెస్ ’ రైళ్లలో సేవలందించేందుకు కొత్త గా నియమించబడ్డ అందమైన అమ్మాయిలైన ‘ట్రెయిన్ హోస్టెస్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరి అనుమతి లేకుండానే సెల్ఫీలు తీసుకోవడం.. కొందరు ఆకతాయిలు కావాలనే వారిని తాకడం..వ్యక్తిగత పనులు చెపుతూ, ఫ్రెండ్ షిప్ చేస్తావా అంటూ ఫోన్ నంబర్ అడుగుతూ హింసిస్తున్నారని ఆ యవతులు వాపోతున్నారు. ఉద్యోగం కోసం వీరంతా భరించి వారికి సేవలందిస్తున్నామంటున్నారు. కొందరు తమతో వీడియోలు తీసి వాటిని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని.. అవి చూసి తమ కుటుంబ సభ్యులు ఏదో సంబంధాలు ఉన్నాయని మథన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతం ఇచ్చే ఈ ట్రెయిన్ హోస్టెస్ జాబ్ ఎంతో ఊహించుకొని వస్తే ఆ ట్రెయిన్ లో ప్రయాణించే ఆకతాయిల వల్ల ఈ అందమైన అమ్మాయిలు ఇప్పుడు నరకయాతన పడుతున్నారట..
నలుపు, పసుపు రంగు దుస్తులతో ఒంటికి అతుక్కుపోయే పొట్టి దుస్తులు ధరించి ట్రెయిన్ హోస్టెస్ భారత మొట్ట మొదటి ప్రైవేట్ రైల్ తేజస్ లో సేవలు అందిస్తుంటారు. భారత రైల్వేలో ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్ రంగంలోని రైలులో వీరు పనిచేస్తారు. ఈ అందమైన అమ్మాయిలు ఎంతో సదుద్దేశంతో ఈ జాబ్ లో చేరినా వీరికి లైంగిక వేధింపులు ఈ రైల్లలో తప్పడం లేదని ఆ యువతులు వాపోతున్నారు.
తొలి కార్పొరేట్ ప్రైవేట్ ట్రైయిన్ అయిన దీనిలో అత్యాధునిక సౌకర్యాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు ఇది నడుస్తుంది. మొత్తం 511 కిలోమీటర్ల దూరాన్ని ఆరున్నర గంటల్లో చేరుకుంటుంది. ఈ రైల్లో ట్రెయిన్ హోస్టెస్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. విమానాల్లోలాగానే అందమైన అమ్మాయిలు మనకు సేవలందిస్తారు. ప్రయాణికులు తినడానికి, తాగడానికి ఇతర అవసరాలు చూడడం..వారి సౌలభ్యం, భద్రతను వీరు చూసుకుంటారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, కొన్ని అధిక సంఖ్యాక వర్గాల వారికి ఈ రైలు ఉపయోగంగా ఉంటుంది. ట్రెయిన్ హోస్టెస్ వల్ల భద్రత ఉంటుంది. ఒక్కో బోగికి ఒకరు చొప్పున మొత్తం 20మందికి పైగానే సేవలందిస్తారు. వీరిపైన లేడీ అధికారులు ఉంటారు. అక్టోబర్ 4న ప్రారంభమైన ఈ రైల్లో ట్రెయిన్ హోస్టెస్ తో ప్రయాణం ఓ మాధురానుభూతి అని చాలా మంది సోషల్ మీడియాలో చెప్పుకున్నారు. వారి ఫోటోలు షేర్ చేస్తున్నారు.
అయితే వీరిని వేధింపులకు గురిచేసేవారు లేకపోలేదు.సేవలు పేరిట లైంగిక వేధింపులు - వీడియోలు - సెల్ఫీలు ట్రెయిన్ హోస్టెస్ అనుమతి లేకుండానే తీసుకోవడం.. వ్యక్తిగత పనులకు తీసుకు వెళ్లడం.. ఫోన్ నంబర్లు అడిగి హింసపెట్టడం ఇలా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారట.. ఈ విషయం తాజాగా ట్రెయిన్ హోస్టెస్ బయటపెట్టడంతో ఈ ట్రెయిన్ హోస్టెస్ ప్రయోగం రైల్వేలో సూట్ అవుతుందా లేదా అన్న మీమాంస రైల్వే శాఖలో వ్యక్తమవుతోంది.