కేసీఆర్ కుమార్తె కవితకు షాకిచ్చిన నెటిజన్!

Update: 2022-05-30 04:30 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు. 2014లో అదే స్థానం నుంచి గెలిచిన కవితకు 2019లో చుక్కెదురు అయ్యింది. కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కవిత ఎక్కువ సమయం నిజామాబాద్ కే కేటాయిస్తున్నారు. ఆ నియోజకవర్గం పరిధిలోనే నివాసం కూడా కట్టుకుని అక్కడే ఉంటున్నారు.

కాగా సోషల్ మీడియాలో కవిత యాక్టివ్ గా ఉంటుంటారు. నిత్యం ఆమె వివిధ అంశాలపై పోస్టులు పెడుతుంటారు. సోషల్ మీడియాలో కల్వకుంట్ల కవితకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. అందులోనూ ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ కు గారాల పట్టి కావడంతో ఆమెను పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలతోపాటు సామాన్య ప్రజలు సోషల్ మీడియలో అనుసరిస్తున్నారు. కవిత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. వివిధ అంశాలపై పోస్టులను పెడుతుంటారు. ఇందులో భాగంగా మే 30న పెట్టిన పోస్టుపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకు కవిత పెట్టిన పోస్టు ఏమిటంటే.. ఈనాడు సండే మ్యాగజైన్ లో పద వినోదం శీర్షిక చాలా పాపులర్. భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తూ సాగే ఈ పద వినోదంకు ఎంతోమంది అభిమానులున్నారు. తాజాగా కవిత కూడా పద వినోదం పూర్తిగా నింపకుండా i give up అంటూ పోస్టు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఓ నెటిజన్ భగ్గుమన్నాడు.

తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. మీ నాన్న (కేసీఆర్) గారేమో ఫామ్ హౌసులో, అన్న (కేటీఆర్) గారు ఫారిన్ ట్రిప్ లో, మీరు (కవిత) ఏమో ఉల్లాసంగా పద వినోదం పూర్తి చేస్తూ హాయిగా ఉన్నారని ట్వీట్ చేశాడు. ప్రజలు ఏమైపోతే మీకేంటి? అంటూ కవితకు ట్వీట్ కు ఘాటు రిప్లై ఇచ్చాడు. దీంతో అతడికి వ్యతిరేకంగా, సానుకూలంగా ఎంతోమంది స్పందిస్తున్నారు. ఏదో ఆదివారం అని చెప్పి సరదాగా ట్వీట్ చేస్తే పాపం కేసీఆర్ గారాలపట్టికి ఇంత కష్టమొచ్చిపడిందేంటి అని కవిత అభిమానులు బాధపడుతున్నారు

కాగా తాజాగా తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రకటించిన జాబితాలో కవితకు కూడా చోటు ఉంటుందని ముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి నిజం కాలేదు. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచే టీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా భారీ విజయం సాధించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ఆమెకు ముందుకు వెళ్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్సీ అయ్యాక కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News