అభ్య‌ర్థుల లిస్ట్ స‌రే.. బీఫాంలు ఇవ్వాలిగా!

Update: 2018-09-07 05:30 GMT
అంతా ఆశ్చ‌ర్య‌పోయేలా.. నోట మాట రాన‌ట్లుగా చేసిన తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే..  త్వ‌ర‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల జాబితాను భారీ స్థాయిలో అనౌన్స్ చేయ‌టం తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం119 స్థానాలు ఉంటే.. అందులో 105 స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించేశారు. అందులో 2 స్థానాలు త‌ప్పించి మిగిలిన 103 స్థానాల‌కు సిట్టింగ్ లు.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్య‌ర్థుల‌కు ఇచ్చారు. ఇక‌.. ఓడిన అభ్య‌ర్థుల‌కు చెందిన కొన్ని స్థానాల‌కు కొత్త అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇంత భారీగా లిస్టును ప్ర‌క‌టించేసిన కేసీఆర్ మీద‌.. టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు.. గ‌తంలో టికెట్ల‌కు సంబంధించి హామీలు పొందిన వారి ప‌రిస్థితి ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేసిన కాసేప‌టికే.. కొంద‌రు ఆశావాహులు త‌మ అసంతృప్తిని బాహాటంగా ప్ర‌ద‌ర్శించారు.

త‌మ‌ను అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించ‌కున్నా.. తాము ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామంటూ కొంద‌రు నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు చేసేస్తున్నారు. దీంతో.. రెబెల్స్ గోల త‌ప్ప‌ద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. భారీగా అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌పై ఆస‌క్తిక‌ర వాద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. టికెట్ల‌ను ఆశిస్తున్న వారికి అసంతృప్తి క‌లిగేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ అదంతా తాత్కాలిక‌మేన‌న్న మాట వినిపిస్తోంది.

టికెట్లు ఇచ్చేందుకు ఏ మాత్రం అవ‌కాశం లేని వారికి టికెట్లు కొన్ని ఇచ్చినా.. పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు అవ‌స‌ర‌మైన బీఫారంలు ఇచ్చే విష‌యంలో కేసీఆర్ త‌న‌దైన షాకులు ఇవ్వ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. పార్టీ అభ్య‌ర్థుల జాబితాను మాత్ర‌మే కేసీఆర్ ప్ర‌క‌టించారే త‌ప్పించి పార్టీ బీఫార‌మ్ లు అభ్య‌ర్థుల‌కు ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దంటూ కొంద‌రు వినిపిస్తున్న వాద‌న‌లు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. అలాంటి ప‌ని కేసీఆర్ చేస్తారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. కేసీఆర్ విష‌యంలో మాత్రం అంచ‌నాలు అంత తేలిగ్గా చేయ‌లేని ప‌రిస్థితి. సో.. అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసినా.. చేతికి బీఫారాలు ఇచ్చే వ‌ర‌కూ సందిగ్థ‌మేన‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఈ త‌ర‌హా వాద‌న‌లో నిజం ఎంత‌న్న దానికి కాల‌మే స‌రిగా స‌మాధానం చెప్ప‌గ‌ల‌దేమో?
Tags:    

Similar News