అధికారపక్షం అన్న ట్యాగ్ ఒక్కటి చాలు కొండంత బలం వెంట ఉన్నట్లే. అలాంటి అధికారపక్ష కార్యకర్తని విపక్షనేతలు తక్కు రేగ్గొట్టం సంచలనంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం మూడు చోట్ల జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జరుగుతున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
అచ్చంపేట ఎన్నికల్లో భాగంగా తొమ్మిదో వార్డులో డబ్బులు పంచేందుకు టీఆర్ ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తను.. విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సదరు కార్యకర్తను చూసిన విపక్ష నేతలు ఉడికిపోయారు. వెనుకా ముందు చూసుకోకుండా అతడిపై దాడికి పాల్పడ్డారు. తుక్కురేగొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించటంతో వారు రంగప్రవేశం చేశారు. సదరు టీఆర్ ఎస్ కార్యకర్త నుంచి లక్ష రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. అధికారపక్షం కార్యకర్తపై విపక్ష నేతలు చేయి చేసుకోవటం స్థానికంగా సంచలన సృష్టిస్తోంది. మరి.. ఈ ఘటనపై తెలంగాణ అధికారపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.