ఆరేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎప్పుడూ ఎదుర్కోని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టీఆర్ఎస్ నేతలు. తమ హయాంలో ఎన్నో గడ్డు పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొంటున్న వారు. తాజాగా మాత్రం రాజకీయ ప్రత్యర్థులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కారణం ఏదైనా కానీ.. మహమ్మారి అంటుకున్న ఎక్కువమంది నేతలు గులాబీ పార్టీకి చెందిన వారే కావటంతో.. వారంతా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
దీనికి తోడు.. గాంధీ ఆసుపత్రిని అద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా చేస్తున్న మాటలు.. ఇప్పుడు తమ ప్రాణాల మీదకుతీసుకొచ్చేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాజిటివ్ వచ్చిన టీఆర్ఎస్ నేతలంతా కార్పొరేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో గాంధీలో వసతులు అంతా బాగున్నప్పుడు అక్కడికి వెళ్లి జాయిన్ కాకుండా.. కార్పొరేట్ ఆసుపత్రుల బాట ఎందుకు పడుతున్నారంటూ వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి.
పాజిటివ్ వచ్చిన వేదన ఒక ఎత్తు అయితే.. తమ ప్రభుత్వ వైఫల్యాల్ని నిలదీస్తూ.. ప్రశ్నిస్తున్న వైనంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచుతున్నాయి. దీనికి నిదర్శనంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో.. గులాబీ నేతల్ని అర్జెంట్ గా గాంధీకి షిఫ్టు చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. గాంధీ ప్రస్తావన వస్తే చాలు గులాబీ నేతలు వణికిపోతున్నట్లు చెబుతున్నారు.