టీఆర్ ఎస్ ఎంపీల‌ను స్వీట్లు అడిగిన మోడీ

Update: 2019-01-08 04:44 GMT
ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో గెలిచిన టీఆర్ ఎస్ పార్టీ విజ‌యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనూహ్య రీతిలో స్పందించారు. టీఆర్ ఎస్ ఎంపీల‌కు ఊహించ‌ని మీ గెలుపును పంచుకోరా అని మోడీ ప్ర‌శ్నించారు.! ఈ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఘ‌ట‌న సాక్షాత్తు ప్ర‌ధాని కార్యాల‌యంలో జ‌రిగింది. టీఆర్‌ ఎస్ కార్యాలయం నిర్మాణానికి ఢిల్లీలో స్థలం కేటాయించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు - సీఎం కే చంద్రశేఖర్‌ రావు రాసిన లేఖను పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి అందించారు. సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిసి రాజేంద్రప్రసాద్ రోడ్డులో స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరారు. ఈ సంద‌ర్భంగా మోడీ ఈ ట్విస్ట్ ఇచ్చారు.

`మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది.. మరి స్వీట్లేవి` అంటూ ప్రధాని మోడీ టీఆర్‌ ఎస్ ఎంపీలతో సరదాగా వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలంటూ మోడీని కలిసిన సందర్భంలో ఈ సరదా సంభాషణ జరిగింది. ఈ స‌మావేశం అనంతరం లోక్‌ సభలో టీఆర్‌ ఎస్ పక్షనేత జితేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో టీఆర్‌ ఎస్‌ ను బలోపేతం చేసేందుకు ఢిల్లీలో కార్యాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. స్థలం కేటాయింపు కోరుతూ ప్రధానికి లేఖ ఇచ్చామన్నారు. తెలంగాణలో అమలుచేసిన పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయడానికి సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని చెప్పారు. 70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ - బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ - ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. కేసీఆర్ లక్ష్యం ప్రధాని పదవి కాదని - దేశంలోని ప్రజలకు మేలు చేయడమని స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం అందించారని గుర్తుచేశారు. ఫెడరల్ ఫ్రంట్ స్థాపనకు ఢిల్లీలోని టీఆర్‌ ఎస్ పార్టీ కార్యాలయం ఎంతో కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.


Full View

Tags:    

Similar News