కూటమి చప్పుళ్లు కారుకే విజయాలు

Update: 2018-11-14 04:19 GMT
మహాకూటమిలో రోజరోజుకు నమ్మకం మరింత పెరిగిపోతోందా...? ముందస్తు ఎన్నికల్లో వారిదే విజయమనే దీమా వారిలో కలుగుతోందా...? ఈ నమ్మకంతోనే వారు తప్పటడుగులు వేస్తున్నారా...?  ఈ ప్రశ్నలంటికీ అవుననే సమాధానం చెబతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీతో కలిసి జత కట్టిన తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సిపీఐలు అన్నీ కాంగ్రెస్ పార్టీకే అప్పగించి మిన్నకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా అతి విశ్వాసంతో తమదే గెలుపనే నమ్మకంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎంత దీమాగా ఉన్నా గెలుపు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికే దక్కుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ముందస్తు ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రకటనతో పాటు ప్రచారంలోనూ మహాకూటమి వెనుకబడి ఉంది. అయినా కాని ఆ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం తమ మాటల తూటాలతో విజయాన్ని అందుకోగలమనే భావిస్తున్నారు. ఆ నలుగురు అంటూ ప్రతి సారి కల్వకుంట్ల చంద్రశేఖర రావు - ఆయన కుమారుడు తారక రామారావు - కుమార్తె కవిత - మేనల్లుడు తన్నీర్ హరీష్ రావులపై చీటికి మాటికీ విరుచుకుపడుతున్నారు. ఇదే వారికి బలంగా మహాకూటమి నాయకులు భావిస్తున్నారు. అయితే ఇది వారి పాలిట శాపంగా మారుతుందని అంటున్నారు. దీనికి కారణం తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా ఆ కుటుంబం వల్లే జరిగిందని ప్రజలు భావిస్తున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు తమ ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితిపై అసత్యపు ప్రచారం చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే తన ప్రచారంతో ప్రజలను ఆకట్టుకున్న కె. చంద్రశేఖర రావు మహాకూటమి తాటాకు చప్పుడులకు బెదరరని రాజకీయ పండితులు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు సెంటిెమెంటు ఎక్కువని తమకు ప్రత్యేక రాష్ట్రం తీసుకుని వచ్చిన కె. చంద్రశేఖర రావు పట్ల ఆదరణ చూపుతారని అంటున్నారు. ఇక టిక్కెట్ల పంపిణి చేసిన మహాకూటమికి ఆ పార్టీలోని రెబెల్స్ నుంచి గట్టి పోటి ఉంటుందని - ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి కలసి వచ్చే అంశం మని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ప్రకటించిన 65 స్దానాలలో దాదాపు 30 చోట్ల అసమ్మతి ఉందని - అది సొంత పార్టీలోనే కాకుండా మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలోనుంచి కూడా ఎదురౌతుందని అంటున్నారు. దీని కారణంగానే తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నల్లేరు మీద నడక లాంటిదేనని చెప్పుతున్నారు.


Tags:    

Similar News