రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు కొన్ని నిమిషాల ముందే చేరుకున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు త్రివిధ దళాల అధిపతులు ట్రంప్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుజరాత్ సంప్రదాయ కళలతో ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. కళాకారులు సంప్రదాయ వాయిద్యాలు, వస్త్రధారణతో ట్రంప్‌కు స్వాగతం పలికారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ట్రంప్ దంపతులు ర్యాలీగా అహ్మదాబాద్ నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి బయల్దేరారు. దారి వెంట వేలాదిగా నిలిచిన భక్తులు స్వాగతం పలికారు. అనంతరం మొహతే స్టేడియాన్ని ప్రారంభిస్తారు. తన పర్యటనలో భాగంగా ట్రంప్ తాజ్ మహాల్ ను సందర్శించనున్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కూడా భేటీ కానున్నారు.