భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. విమానం దిగగానే అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా త్రివిధ దళాల అధిపతులు విశేష స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి సబర్మతీ ఆశ్రమానికి భారీ కాన్వాయితో ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ట్రంప్ కు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ప్రజలు ఘన స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనలో భారత జెండాలు త్రివర్ణ పతాకం కాకుండా అమెరికా జెండాలు కనిపించాయి.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి.. మోతెరా క్రికెట్ స్టేడియం 22 కిలోమీటర్ల మేర.. ట్రంప్, ప్రధాని మోదీ రోడ్ షో ఉంది. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్ రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. దాదాపు 35 నిమిషాల పాటు కొనసాగే ఆ ర్యాలీ లో కూడా పెద్ద ఎత్తున అమెరికా జెండాలు కనిపించాయి. త్రివర్ణ పతాకం కన్నా పెద్ద ఎత్తున అమెరికా జెండాలు దర్శనమి్చాయి. మధ్యాహ్నం 12.30కి స్టేడియం ప్రారంభం తర్వాత నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొని మాట్లాడారు.