ఐసిస్ కొత్త బాస్ ను లేపేస్తామని చెప్పిన ట్రంప్

Update: 2019-11-13 11:09 GMT
ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని ఏసేసే విషయంలో ట్రంప్ ఎంత పట్టుదలతో వ్యవహరించారో తెలిసిందే. అప్పట్లో లాడెన్ ను అంత మొందించే విషయం లో ఒబామా ప్రదర్శించిన వైఖరి కి.. ఐసిస్ అధినేత ను హత మార్చిన ఎపిసోడ్ లో ట్రంప్ వ్యవహరించిన తీరు పైన సోషల్ మీడియా లో జరుగుతున్న చర్చ తెలిసిందే.  

ఐసిస్ అధినేత ను ఏసేయటం తో సక్సెస్ అయిన ట్రంప్.. తాను రెండోసారి అధ్యక్ష బరిలో ఉండేందుకు అవసరమైన అర్హత ను సంపాదించినట్లు గా ఫీల్ అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష పదవి లో రెండో సారి పదవి ని చేపట్టాలన్న పట్టుదల తో ఉన్న ట్రంప్.. అందుకు ఉండే ఏ చిన్న అవకాశాన్నిఆయన వదిలి పెట్టటం లేదు. ఐసిస్ చీఫ్ ను లేపేసిన ఎపిసోడ్ లో తనకొచ్చిన మైలేజీ ని మరింత పెంచుకునేందుకు ఆయన కొత్త వాదన ను తెర మీదకు తీసుకొచ్చారు.

బాగ్దాదీ హతమైన తర్వాత ఐసిస్ కు కొత్త బాస్ ను తాము వదిలిపెట్ట బోమన్న సంచలన మాటను ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే అతని కోసం వేట మొదలైందన్న ఆయన.. అత గాడి అడ్రస్ తమకు తెలిసిందన్నారు. తాజాగా ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ లో నిర్వహించిన కార్యక్రమం లో మాట్లాడిన ట్రంప్.. ఐసిస్ కొత్త అధినేత అంతం గురించి పదే పదే ప్రస్తావించటం చూస్తే.. ట్రంప్ తర్వాత టార్గెట్ ఏమిటన్న విషయంపై క్లారిటీ రాక మానదు.

రెండు రోజుల వ్యవధి లో ఐసిస్ కొత్త అధినేతను హతమార్చే విషయం లో తమ ప్రభుత్వం ఎంత కమిట్ మెంట్ తో ఉందన్న విషయాన్ని తన మాటలతో స్పష్టం చేస్తున్న ట్రంప్ మాటలు ఇప్పుడు హీటు పుట్టిస్తున్నాయి. అబు బకర్ అల్ బాగ్దాదీ అంతం తర్వాత ఐసిస్ కొత్త అధినేతగా అబు ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లుగా ఐసిస్ ప్రకటించింది. ఇప్పుడు తమ తర్వాతి టార్గెట్ అతగాడే అన్న ట్రంప్.. తాను చెప్పిన పనిని ఎంతకాలంలో పూర్తి చేస్తారో చూడాలి. అయినా.. సీక్రెట్ గా చేయాల్సిన ఆపరేషన్ ను ఇంత ఓపెన్ గా అదే పనిగా ప్రస్తావించటం ఏమిటో?
Tags:    

Similar News