అమెరికా అధ్యక్షుడిగా దిగిపోతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ తన అక్కసును అంతా తీర్చుకుంటున్నాడు.తనను ఓడించిన అమెరికన్లకు షాకులు ఇస్తున్నాడు. తన పంతాను మార్చుకోకుండా పలు వివాదాస్పద బిల్లులను ఆమోదిస్తున్నాడు.
కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న అమెరికా వాసులను ఆదుకోవాల్సిన కరోనా సహాయం బిల్లుకు ట్రంప్ గండికొట్టడం దుమారం రేపుతోంది. గతంలో కరోనా సహాయ నిధి కోసం ట్రంప్ ప్రభుత్వం 2.3 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని విడుదల చేయాలని నిర్ణయించింది.కానీ ఈ బిల్లుపై సంతకం చేసేందుకు తాజాగా ట్రంప్ తిరస్కరించారు. దీంతో మిలియన్ల మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి కోల్పోయారు.
ఉపాధి లేక అల్లాడుతున్న లక్షల మంది అమెరికా నిరుద్యోగులకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారింది. కోవిడ్ సహాయ బిల్లు, ప్రత్యేక నిరుద్యోగ భృతికి 892 బిలియన్ల డాలర్లు, ప్రభుత్వ వ్యయం 1.4 లక్షల కోట్ల డాలర్ల బిల్లుపై గడువు డిసెంబర్ 26కే ముగిసింది. ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేయకపోతే దాదాపు 1.4 కోట్ల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోల్పోతారు.
ఈ బిల్లుపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడం చాలా మంది వైట్ హౌస్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికాలో ఆర్థిక సాయం చేయాలని నిరసనలు జరుగుతున్న ట్రంప్ ఇలా వ్యవహరించడంపై సొంత పార్టీ రిపబ్లికన్లలో కూడా వ్యతిరేకత వస్తోందని తెలిసింది.
ఇక అమెరికన్లకు ఆర్థిక సాయం అందకుండా ట్రంప్ సంతకం చేయకపోవడంపై కొత్తగా కాబోయే అధ్యక్షుడు జోబిడెన్ వర్గం తీవ్రంగా మందలించింది. వెంటనే అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.