ట్రంప్ దెబ్బకు మెక్సికో కుబేరుడి జేబు గుల్ల

Update: 2016-11-11 10:01 GMT
 అమెరికాలో ట్రంప్ గెలిస్తే మెక్సికోలో ఓ పెద్దాయనకు 31 వేల కోట్ల నష్టమొచ్చింది. అదెలా అంటారా.. ఇంకేముంది ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినట్లే మెక్సికోలోనూ కుప్పకూలాయి. పైగా అక్కడి కరెన్సీ పెసో వేల్యూ కూడా పడిపోయింది. దీంతో మదుపరులకు నష్టం తప్పలేదు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు చిన్న మదుపరలకు తక్కువ నష్టం వస్తే బిగ్ షాట్లకు భారీగా నష్టమొచ్చింది.  అందులో భాగంగానే మెక్సికోలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ ధనవంతుల్లో నాలుగో స్థానంలో ఉన్న కార్లోస్ స్లిమ్ సంపద పడిపోయింది.

51 బిలియన్ డాలర్ల ఆస్తులున్న కార్లోస్ సంపదలో సుమారు 5 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయట. అంటే సుమారు 10 శాతం ఆస్తి పోయినట్లే.

62 శాతం కార్లోస్ పెట్టుబడులున్న అమెరికా మోవిల్ టెలికమ్యూనికేషన్ల కంపెనీ షేర్లు 9 శాతం పతనం కావడంతో భారీ దెబ్బ పడింది. ట్రంపు గెలుపుతో మెక్సికన్ పెసో బాగా దెబ్బతింది. 13 శాతం నష్టపోయింది. ఎన్నడూ లేనంతగా ఒక అమెరికన్ డాలర్ కు 21 పెసోలకు పడిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News